తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్: ప్రశ్నాపత్రంలో చాయిస్ పెంపు

By narsimha lodeFirst Published Jan 23, 2022, 9:54 AM IST
Highlights


ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో విద్యార్ధులకు మరిన్ని ఛాయిస్ పెంచాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకొంది. గత ఏడాది నిర్వహించిన పరీక్షల్లో కంటే ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో ఛాయిస్ పెంచాలని నిర్ణయం తీసుకొంది.


హైదరాబాద్: Inter పరీక్షల్లో విద్యార్ధులకు మరిన్ని ఛాయిస్ పెంచాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. గత ఏడాది నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కూడా ఛాయిస్ ఇచ్చింది. ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో కూడా ఛాయిస్ ను గతంలో కంటే మరింత పెంచాలని కూడా ఇంటర్ బోర్డు భావిస్తుంది.  గత ఏడాది నిర్వహించిన Science గ్రూపుల్లో  రెండు మార్కుల ప్రశ్నల్లో ఛాయిస్ ఇవ్వలేదు. అయితే ఈ ఏడాది నిర్వహించే పరీక్షల్లో ఛాయిస్ పెంచాలని ఇంటర్ బోర్డు తలపెట్టింది.

అయితే  వార్షిక పరీక్షల్లో  10 ప్రశ్నలకు 10 జవాబులు రాయాల్సి ఉంది. అయితే 15 ప్రశ్నలకు 10 జవాబులు రాసేలా Choice ఇస్తారు. Arts  గ్రూప్ లో గతంలో 10 మార్కుల ప్రశ్నలు ఆరు ఇస్తే మూడు ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. అయితే వార్షిక పరీక్షల్లో ప్రశ్నల సంఖ్యను పెంచి ఛాయిస్ ఇవ్వనుంది. ఐదు మార్కుల ప్రశ్నలు 16 ఇవ్వనున్నారు. అయితే ప్రశ్నలను 18కి పెంచనున్నారు.  ఈ ఏడాది మే మాసంలో ఇంటర్ ప్రథమ పరీక్షలు నిర్వహించనున్నారు.

గత ఏడాది ఇంటర్ First Year పరీక్షల్లో 51 శాతం విద్యార్ధులు ఫెయిలయ్యారు.మొత్తం 4,59,242 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తే కేవలం 2,24,012 మంది విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.  ఇలా ఫెయిల్ అయిన విద్యార్థుల్లో చాలామంది మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో  ఫెయిలైన విద్యార్ధులను కూడా పాస్ చేస్తున్నట్టుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఏడాది డిసెంబర్ 6న ప్రకటించారు.

విద్యార్థుల ఆత్మహత్యలతో రంగంలోకి దిగిన ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టారు. ఇంటర్మీడియట్ బోర్డు వద్ద బిజెపి, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 

ఇలా ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరు పాస్ అయ్యారు. విద్యార్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో కనీస మార్కులు వేసి పాస్ చేసింది ఇంటర్ బోర్డు. ఈ మార్కుల మెమోలనే ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 

 

click me!