ఎగ్జిట్ పోల్స్: టిఆర్ఎస్ దే పైచేయి.. వెల్లడించిన ఇండియా టుడే!

Siva Kodati |  
Published : May 19, 2019, 06:58 PM IST
ఎగ్జిట్ పోల్స్: టిఆర్ఎస్ దే పైచేయి.. వెల్లడించిన ఇండియా టుడే!

సారాంశం

తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), కాంగ్రెసు పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), కాంగ్రెసు పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణాలో ఫలితాలు ఈవిధంగా ఉండబోతున్నట్లు ఇండియా టుడే సంస్థ ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం టిఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 10 నుంచి 12 స్థానాలు గెలుచుకోనున్నట్లు ప్రకటించారు.  

తెలంగాణ (17) 

టిఆర్ఎస్ : 10-12

బిజెపి : 1-3

కాంగ్రెస్ 1-3

ఇతరులు : 0-1 

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే