ప్రియాంకరెడ్డి.. చెల్లెలికి కాకుండా పోలీసులకు ఫోన్ చేసుండాల్సింది: మహమూద్ అలీ

By sivanagaprasad KodatiFirst Published Nov 29, 2019, 4:45 PM IST
Highlights

డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణహత్య తనను తీవ్రంగా కలచివేసిందన్నారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. శుక్రవారం ప్రియాంక కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు

డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణహత్య తనను తీవ్రంగా కలచివేసిందన్నారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. శుక్రవారం ప్రియాంక కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక తన బిడ్డ లాంటిదని, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సైబరాబాద్ సీపీ పది ప్రత్యేక బృందాల ద్వారా నిందితులను గుర్తించారని... సాయంత్రానికి దర్యాప్తు మొత్తం పూర్తవుతుందని మంత్రి పేర్కొన్నారు.

Also read:రక్తమోడుతున్నా కరుణించని మృగాలు: ప్రియాంకపై దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు వీళ్ళే..

ప్రియాంకపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని మహమూద్ అలీ తెలిపారు.

మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన షీటీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. ప్రియాంకరెడ్డి ఆమె చెల్లెలికి కాకుండా పోలీసులకు ఫోన్ చేసుంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

వెటర్నిరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అంతా 35 ఏళ్ల లోపు ఉన్నవారేనని తెలుస్తోంది.ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

లారీ డ్రైవర్ గా పని చేస్తున్న ముహ్మద్ పాషా, జోలు శివ, జోలు నవీన్, చెన్నకేశవులుగా పోలీసులు గుర్తించారు. ఇకపోతే లారీ డ్రైవర్ మహ్మద్ పాషా మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మిగిలిన ముగ్గురు నిందితులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 

జోలు నవీన్, జోలు శివలు అన్నదమ్ముల కుమారులు అని తెలుస్తోంది. చెన్నకేశవులు కూడా స్థానికుడేనని పోలీసులు విచారణలో నిర్ధారించారు. నిందితులు నలుగురు కూడా 35 ఏళ్లలోపు వారే కావడం విశేషం. 

ఈ నలుగురు నిందితులలో ముహ్మద్ పాషా కాస్త పెద్దవాడని తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు అంటే జోలు శివ, జోలు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ముగ్గురూ కూడా 30 ఏళ్లలోపు వారేనని పోలీసులు నిర్ధారించారు. 

Also Read:Priyanka Reddy: మృగాల చేతుల్లో నరకయాతన, కిటికీ అద్ధాలు ధ్వంసం చేసి......

ఈ నలుగురు నిందితులు ప్రియాంకరెడ్డిని అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారని తెలుస్తోంది. ముహ్మద్ పాషా నడిపిస్తున్న లారీని అడ్డంపెట్టుకుని తీవ్రంగా దాడి చేశారని సమాచారం. 

నలుగురు యువకులే కావడంతో వారు తీవ్రంగా దాడి చేయడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రియాంక చేరుకుందని పోలీసుల విచారణలో తేలింది. బోరున విలపిస్తున్న ఆ మానవ మృగాల మనసు కరగలేదు. 

click me!