Priyanka Reddy: మృగాల చేతుల్లో నరకయాతన, కిటికీ అద్ధాలు ధ్వంసం చేసి......

Published : Nov 29, 2019, 03:27 PM ISTUpdated : Nov 29, 2019, 09:48 PM IST
Priyanka Reddy: మృగాల చేతుల్లో నరకయాతన, కిటికీ అద్ధాలు ధ్వంసం చేసి......

సారాంశం

తనను వదిలిపెట్టాలని ప్రియాంకరెడ్డి ఎంత బ్రతిమిలాడినా దుర్మార్గులు వదిలిపెట్టలేదని పోలీసుల విచారణలో తేలింది. దాడి చేసిన తర్వాత ప్రియాంకరెడ్డి నిస్సహాయురాలుగా మారడంతో నిర్మానుష్యమైన ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు నలుగురు దుండగులు.   

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసులో అనేక దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియాంకరెడ్డిపట్ల కామాంధులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారని తెలుస్తోంది.  

ముందుగానే ప్లాన్ ప్రకారం ప్రియాంకరెడ్డి బైక్ పంక్చర్ చేసిన నిందితులు అనంతరం ఆమెకు సాయం చేస్తున్నట్లు నమ్మిస్తూ నాటకాలు ఆడారు. అనంతరం ప్రియాంకరెడ్డిని కిడ్నాప్ చేశారు. అక్కడ లారీలను అడ్డుపెట్టుకుని ఆమెపై దాడికి పాల్పడ్డారు. 

ఆమె తనను వదిలిపెట్టాలని ప్రియాంకరెడ్డి ఎంత బ్రతిమిలాడినా దుర్మార్గులు వదిలిపెట్టలేదని పోలీసుల విచారణలో తేలింది. దాడి చేసిన తర్వాత ప్రియాంకరెడ్డి నిస్సహాయురాలుగా మారడంతో నిర్మానుష్యమైన ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు నలుగురు దుండగులు. 

 

ఆ నిర్మానుష్య ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి తీసుకెళ్దామని ప్రయత్నించారు. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో కిటీలోంచి ఇట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయిద్దామని ప్రయత్నించారు. ప్రియాంకను కిటికీలోంచి లోపలికి తోసి అత్యాచారం చేసేంందుకు కూడా ప్రయత్నించారు దుర్మార్గులు. కిటికీ అద్దాలు ద్వంసం చేశారు. అయితే అద్దాలు పూర్తిగా ధ్వంసం కాకపోవడంతో ఆ నిర్మానుష్య ప్రదేశంలోనే ప్రియాంకరెడ్డిపై అత్యాచారం చేశారు. 

అత్యాచారం చేసిన అనంతరం ఆమెను అత్యంత దారుణంగా హతమార్చారని తెలుస్తోంది. పోలీసులకు ఎలాంటి సాక్షాలు దొరక్కుండా ఉండేందుకు ఆమెను చంపి ఆ మృతదేహాన్నిలారీలో వేసుకుని వేరే ప్రాంతంలో పడేసి తగులబెట్టారు. 

ఆ తర్వాత పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు చటాన్ పల్లిబ్రిడ్జ్ కిందకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగులబెట్టినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. 

అయితే పోలీసులకు అటువైపు వెళ్తున్న పాలవ్యాపారి మంటలను గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మహిళ మృతదేహంగా గుర్తించారు.  

అయితే ఈ ఘటనలో నిందితులు ప్రొఫెషనల్ కిల్లర్స్ గా వ్యవహరించారని తెలుస్తోంది. ఒక చోట హత్య చేసి ఎవరికీ అంతుపట్టకుండా మృతదేహాన్ని చటాన్ పల్లి బ్రిడ్జ్ కింద లారీలో తీసుకువచ్చి మరీ దహనం చేశారు. 

అంతేకాదు ప్రియాంకరెడ్డి స్కూటీని ఘటనా స్థలం నుంచి 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి విడిచిపెట్టడం చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  

PREV
click me!

Recommended Stories

KTR Speech: కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఎదురు దెబ్బలు పట్టించుకోము | Asianet News Telugu
Hyderabad Police Commissioner VC Sajjanar Celebrate New Year at Charminar HYD | Asianet News Telugu