అసోం సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరైనవి కావు: తెలంగాణ మంత్రి మహమూద్ అలీ

By narsimha lode  |  First Published Sep 9, 2022, 5:28 PM IST

అసోం సీఎం హిమంత బిశ్వశర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరైనవి కావని కావన్నారు. హైద్రాబాద్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 


హైదరాబాద్: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ  రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరైనవి కావని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ  చెప్పారు.శుక్రవారం నాడు సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీతో కలిసి గణేష్ నిమజ్జన శోభా యాత్రను హోం మంత్రి మహమూద్ అలీ హెలికాప్టర్ లో పరిశీలించారు. అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. హైద్రాబాద్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 

అన్ని శాఖలు సమన్వయంతో  గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేశాయని ఆయన చెప్పారు.  ప్రశాంతంగా,.  శాంతియుతంగా నిమజ్జన శోభాయాత్ర సాగుతుందన్నారు.పాతబస్తీలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని మంత్రి తెలిపారు. 

Latest Videos

undefined

అనంతరం  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  మీడియాతో మాట్లాడారు.  హైద్రాబాద్ ను ప్రశాంతంగా ఉండనీయరా అని ప్రశ్నించారు. హైద్రాబాద్ లో చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి అసొం సీఎం ఏం మాట్లాడారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. దేవుడు, భక్తి గురించి మాట్లాడడం మానేసి అసోం సీఎం  ఏం మాట్లాడారని ఆయన ప్రశ్నించారు.

also read:హైద్రాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత: అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత

నాలుగైదు రోజులగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నా కూడ నిమజ్జన ఏర్పాట్లు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు జరిగాయో లేదో అందరికీ తెలుస్తుందని తాము మాట్లాడలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అసోం సీఎం మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు వెళ్లి మైక్ లాగే ప్రయత్నం చేశారన్నారు. పరువు లేని పనులు చేస్తే ఇలానే ఉంటుందని ఆయన మండి పడ్డారు.  బాధ్యత గల వ్యక్తులు ఈ రకంగా వ్యవహరించవద్దని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. 

click me!