తెలంగాణలో నయా నిజాం పాలనను అంతం చేస్తాం: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ

By narsimha lodeFirst Published Sep 9, 2022, 3:47 PM IST
Highlights

తెలంగాణలో నయా నిజాం పాలనను అంతం చేస్తామని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చెప్పారు.  కేసీఆర్ జాతీయ పార్టీని పెట్టుకోవచ్చన్నారు అయితే పార్టీ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. 

హైదరాబాద్: తెలంగాణలో నయా నిజాం పాలనను అంతం  చేస్తామని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చెప్పారు. హైద్రాబాద్ లో జరిగే  కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా శుక్రవారం నాడు పలు మీడియా చానెల్స్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ నయా నిజాం మాదిరిగా పాలన చేస్తున్నాడన్నారు. ఆయన పాలనను తమ పార్టీ అంతం చేయనుందనే ధీమాను  వ్యక్తం చేశారు. కుటుంబ పార్టీలు వారి కోసమే  ఆలోచిస్తాయన్నారు..

టీఆర్ఎస్ సహా అన్ని కుటుంబ పార్టీలది అదే పరిస్థితి అని ఆయన చెప్పారు.కేసీఆర్  కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని  అసోం సీఎం చెప్పారు. పార్టీ పెట్టేందుకు కేసీఆర్ దగ్గర చాలా డబ్బులుండొచ్చని ఆయన చెప్పారు. అయితే కేసీఆర్ కు డబ్బులు  ఎక్కడి నుండి వస్తున్నాయనేదే  అసలు సమస్యగా ఆయన పేర్కొన్నారు.  ప్రధాని మోడీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కూడా ఐక్యంగా ఉన్నాయన్నారు. కొత్తగా విపక్షాలను ఐక్యం చేయాల్సిన అవసరం కేసీఆర్ కు ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో తమకు విపక్షం కానే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

also read:జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలి: కేసీఆర్ ను కోరిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు

తెలంగాణ సీఎం కేసీఆర్  జాతీయ రాజకీయాల్లోకి రావాలని  ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇవాళ పలు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు ఇవాళ హైద్రాబాద్ లో మీడియా సమావేశం  ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని కోరారు. 2024లో దేశంలో బీజేపీ లేని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారంలో బీహర్ సీఎం నితీష్ కుమార్ ను కేసీఆర్ కలిశారు. ఈ నెల 11న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి  హైద్రాబాద్ కు వస్తున్నారు.  జాతీయ రాజకీయాలపై కుమారస్వామి చర్చించనున్నారు.

గతంలో కూడ  బెంగాల్, తమిళనాడు , కేరళ రాష్ట్రాల సీఎంలతో  కేసీఆర్ చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ చేసే దిశగా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు.

click me!