తెలంగాణ: ఎంసెట్ సహా నాలుగు ఎంట్రన్స్ టెస్టులు రీ షెడ్యూల్.. ?

By Siva KodatiFirst Published Jun 16, 2021, 7:19 PM IST
Highlights

తెలంగాణలో నాలుగు కామన్ ఎంట్రన్స్ టెస్టులను రీ షెడ్యూల్ చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఉన్నత విద్యా మండలి. జూలై 5 నుంచి 9 వరకు జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను ఆగస్టుకు వాయిదా వేసింది. కొత్త తేదీలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది

తెలంగాణలో నాలుగు కామన్ ఎంట్రన్స్ టెస్టులను రీ షెడ్యూల్ చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఉన్నత విద్యా మండలి. జూలై 5 నుంచి 9 వరకు జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను ఆగస్టుకు వాయిదా వేసింది. కొత్త తేదీలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. పీఈ సెట్, పీజీ ఈసెట్ తేదీల్లో కూడా మార్పులు చేసింది ఉన్నత విద్యామండలి. ఈ పరీక్షలు ఆగస్టు 1వ తేదీ నుంచి 15 మధ్య నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Also Read:వారంలో ఇంటర్ ఫలితాల ప్రకటన: బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్

మరోవైపు ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది.  ఇంటర్ ఫస్టియర్ తో పాటు సెకండియర్ పరీక్షలను కూడ ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది.ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు మార్కులను కేటాయించే విషయమై  కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా విద్యార్థులకు మార్కుల కేటాయింపు జరగనుంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ వారం రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని 4,73,967 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఫస్టియర్ లో ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులను కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

 

click me!