రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట: జైలు శిక్షపై స్టే

By Siva KodatiFirst Published Feb 10, 2021, 4:02 PM IST
Highlights

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఏడాది జైలు శిక్ష విధిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, 2016లో ఉస్మానియా యూనివర్సిటీ బీఫ్ ఫెస్టివల్లో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ చేస్తే… మరో దాద్రి అవుతుందని వ్యాఖ్యానించారు.

దీంతో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పీఎస్‌కు తరలించారు. అక్కడ కూడా ఆయన అదే పదజాలం ఉపయోగించడంతో పాటు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.  

Also Read:నాంపల్లి కోర్టు సంచలన తీర్పు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జైలు శిక్ష

దీంతో సెక్షన్ 295 A కింద బొల్లారం పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ఐదేళ్ల తర్వాత ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఆ తీర్పును సవాలు చేస్తూ రాజాసింగ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే మంజూరు చేస్తూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.  

click me!