కామవాంఛ తీర్చమన్న కానిస్టేబుల్.. వివాహితకు వేధింపులు..

Published : Feb 10, 2021, 03:28 PM IST
కామవాంఛ తీర్చమన్న కానిస్టేబుల్.. వివాహితకు వేధింపులు..

సారాంశం

కాపాడాల్సిన ఖాకీలే కర్కషంగా కాటేస్తున్నారు. లైంగిక సంబంధం పెట్టుకోమంటూ వేధిస్తూ హింసిస్తున్నారు. హైదరాబాద్ సైదాబాద్ లో జరిగిన ఈ దారుణం వెలుగు చూసింది. 

కాపాడాల్సిన ఖాకీలే కర్కషంగా కాటేస్తున్నారు. లైంగిక సంబంధం పెట్టుకోమంటూ వేధిస్తూ హింసిస్తున్నారు. హైదరాబాద్ సైదాబాద్ లో జరిగిన ఈ దారుణం వెలుగు చూసింది. 

ప్రస్తుతం సైదాబాద్ రెడ్డి బస్తీలో ఉంటున్న గిరిజన మహిళ.. మూడేళ్ల క్రితం కుటుంబంతో సహా పూసల బస్తీలో ఉండేది. ఆ టైంలో వారి పక్కింట్లో ఓ కానిస్టేబుల్ కుటుంబం ఉండేది. అతను మాదన్న పేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. 

పక్క పక్క ఇండ్లు కావడంతో ఇరు కుటుం సభ్యులు సన్నిహితంగా ఉండేవారు. దీన్ని కానిస్టేబుల్ అలుసుగా తీసుకున్నాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిని వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు.

ఈ క్రమంలో ఓరోజు ఆమె భర్త ఎదుటనే ఆమెను అసభ్యంగా దూషించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో కొంతకాలం కామ్ అయ్యాడు. ఆ తరువాత మళ్లీ తిరిగి వేధింపులు మొదలు పెట్టాడు. గతనెల 25న బాధితురాలి ఇంటికి వెళ్లి అత్యాచారయత్నం చేశాడు.

దీంతో భయపడ్డ బాధితురాలు తెల్లారి సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu