యాసంగిలో వరి సాగు.. ఆ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే: సిద్ధిపేట కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

By Siva KodatiFirst Published Nov 3, 2021, 4:00 PM IST
Highlights

యాసంగిలో వరి విత్తనాలు అమ్మకానికి సంబంధించి సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై తెలంగాణ హైకోర్టు (telangana high court) మండిపడింది.

యాసంగిలో వరి విత్తనాలు అమ్మకానికి సంబంధించి సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై తెలంగాణ హైకోర్టు (telangana high court) మండిపడింది. వరి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్‌ చేస్తూ సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు బత్తుల నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిన్నోళ్ల నరేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, వరి విత్తనాలు విక్రయించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. ‘జిల్లా మెజిస్ట్రేట్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. చట్టానికి అతీతులు ఎవరూ కాదని.. కోర్టులు ఆదేశించినా లెక్క చేయనని పేర్కొనడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. భవిష్యత్తులో కలెక్టర్‌కు ఏదైనా సమస్య వచ్చినా న్యాయస్థానాన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది అని న్యాయమూర్తి గుర్తుచేశారు.  వరి విత్తనాలను నిషేధిత జాబితాలో ఏమైనా చేర్చారా అంటూ ప్రభుత్వాన్ని ధర్మాసనం నిలదీసింది. కలెక్టర్‌పై తదుపరి చర్యల కోసం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ మేరకు వెంకట్రామిరెడ్డిపై క్రిమినల్‌ కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. 

ALso Read:వరి వేస్తే వేటాడుతా.. సుప్రీం చెప్పినా వినను : సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై దుమారం.. రేవంత్ ఫైర్

మరోవైపు సిద్ధిపేట కలెక్టర్ (siddipet collector) వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) వ్యాఖ్యలపై తెలంగాణలో (telangana) దుమారం చెలరేగుతోంది. రైతులు ఒక్క ఎకరం వరి (paddy seeds) వేసుకున్నా కూడా అది ఉరి వేసుకున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై వెంకట్రామిరెడ్డి స్పందిస్తూ... తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని డీలర్లను (dealers) కోరామని ఆయన స్పష్టం చేశారు. అందుకు డీలర్లు సహకరిస్తామన్నారని.. ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే రైతులకు లాభమని కలెక్టర్ సూచించారు. అసత్యాలను ప్రచారం చేయడం సరికాదని వెంకట్రామిరెడ్డి హితవు పలికారు. 

ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో గత మంగళవారం వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తనాలు సరఫరా చేసే డీలర్ల సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ కలెక్టర్ వ్యాఖ్యానించారు. 

click me!