ఎంతో కీలకమైన ప్రభుత్వ సర్వీస్ కమీషన్ లో ప్రస్తుతం ఒక్కరే సభ్యుడు వుండటంపై తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని చేపట్టే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్ పిఎస్సి) ను నిర్వీర్యం చేసేలా సర్కార్ చర్యలున్నాయంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతో కీలకమైన సర్వీస్ కమీషన్ లో ప్రస్తుతం ఒక్కరే సభ్యుడు వుండటంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వెంటనే పబ్లిక్ కమిషన్‌కి 4 వారాల్లో చైర్మన్, సభ్యులను నియమించాలని కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఓ నిరుద్యోగ యువకుడు దాఖలుచేసిన పిల్ పై హైకోర్టు ఇవాళ(గురువారం) విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రస్తుత టీఎస్ పిఎస్సి పరిస్థితి గురించి తెలుసుకున్న న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు చేశారు. వెంటనే టీఎస్ పిఎస్సి ఛైర్మన్ తో పాటు పూర్తిస్థాయి సభ్యులను నియమించాలని... ఆ తర్వాత ఓ నివేదికను కూడా సమర్పించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
read more ఎస్‌బీఐలో క్లర్క్ పోస్ట్స్ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హత వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
''టీఎస్ పిఎస్సి ని పూర్తిగా మూసివేయాలన్న ఉద్దేశ్యం మీకేమైనా వుందా? ఛైర్మన్ కాదు కనీసం సభ్యులు కూడా లేని సర్వీస్ కమీషన్ ఎందుకు... మూసేయండి'' అంటూ న్యాయస్థానం తీవ్రస్థాయిలో హెచ్చరించింది. దీంతో వెంటనే కమీషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని ప్రభుత్వం తరపున ఏజీ కోర్టుకు విన్నవించారు. ఈ విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.