కరీంనగర్ కరోరా కల్లోలం... జెడ్పీ చైర్‌ పర్సన్‌కు పాజిటివ్

Arun Kumar P   | Asianet News
Published : Apr 29, 2021, 02:51 PM ISTUpdated : Apr 29, 2021, 02:54 PM IST
కరీంనగర్ కరోరా కల్లోలం... జెడ్పీ చైర్‌ పర్సన్‌కు పాజిటివ్

సారాంశం

కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ తాజాగా కరోనా బారిన పడ్డారు. 

కరీంనగర్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ బారినపడగా తాజాగా కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ కరోనా బారిన పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో విజయ కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఉన్నత హోదాలో పనిచేస్తున్న విజయ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలో జాయిన్ కావడం గమనార్హం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లు కరోనా బారిన పడితే వారిని గాంధీలో చేర్పించాలన్న డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్ జెడ్పీ ఛైర్ పర్సన్ మాత్రం సివిల్ ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స చేయించుకుంటుండటం అందరినీ ఆలోచింపజేస్తుంది.

read more   18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వలేం: తేల్చిచెప్పిన ఈటల

ఇక తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్త 7,994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం గడిచిన 24 గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

కోవిడ్ వ్యాధిని బారిన పడినవారిలో గత 24 గంటల్లో 4009 మంది కోలుకున్నారు. కాగా, 58 మంది మృత్యువాత పడ్డారు ప్రస్తుతం తెలంగాణలో 76 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,28,28,763 శాంపిల్స్ ను పరీక్షించగా 4,27,960 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో 3 లక్షల 49 వేల 692 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మొత్తం 2208 మంది మరణించారు.  ప్రస్తుతం 76 వేల 60 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 81.71 శాతం ఉంది. మరణాల రేటు 0.51 శాతం ఉంది. 

జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1630 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మేడ్చెల్ మల్కాజిరిగి జిల్లాలో 615, రంగారెడ్డి జిల్లాలో 558 కేసులు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లాలో 424, సంగారెడ్డి జిల్లాలో 33, నిజామాబాద్ జిల్లాలో 301, సిద్ధిపేట జిల్లాలో 269, మహబూబ్ నగర్ జిల్లాలో 263 కేసులు రికార్డయ్యాయి.

జగిత్యాల జిల్లాలో 238, ఖమ్మం జిల్లాలో 213, సూర్యాపేట జిల్లాలో 207, వికారాబాద్ జిల్లాలో 207, నాగర్ కర్నూలు జిల్లాలో 206, మంచిర్యాల జిల్లాలో 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu