గద్వాల గర్భిణి మృతి: క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన హైకోర్టు

By narsimha lode  |  First Published May 27, 2020, 2:19 PM IST

గద్వాల గర్భిణి మృతికి కారణమైన వారిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. డెలీవరి కోసం గద్వాలకు చెందిన గర్భిణి 200 కి.మీ. దూరం ప్రయాణంచినా కూడ ఫలితం దక్కలేదు. బిడ్డతో పాటు గర్భిణి ఏప్రిల్ 24వ తేదీన మరణించిన విషయం తెలిసిందే.
 



హైదరాబాద్: గద్వాల గర్భిణి మృతికి కారణమైన వారిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. డెలీవరి కోసం గద్వాలకు చెందిన గర్భిణి 200 కి.మీ. దూరం ప్రయాణంచినా కూడ ఫలితం దక్కలేదు. బిడ్డతో పాటు గర్భిణి ఏప్రిల్ 24వ తేదీన మరణించిన విషయం తెలిసిందే.

also read:ఆరుగురు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే గద్వాల గర్భిణీ మృతి: హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక

Latest Videos

undefined

గద్వాల గర్భిణి మృతి చెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన నివేదికను ఇచ్చింది. ఆరుగురు డాక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బాద్యులుగా ప్రకటించింది.

గర్భిణి మృతికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  చేసిన తప్పుకు శిక్ష ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హైకోర్టు అభిప్రాయపడింది.

ఆసుపత్రుల్లో వైద్యం అందుతున్న తీరుపై కమిటీని వేయాలని కూడ ప్రభుత్వాన్ని ఆదేశించింది  హైకోర్టు.రిటైర్డ్ సూపరింటెండ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరిలతో కమిటిని ఏర్పాటు చేయాలని కూడ హైకోర్టు  కోరింది.

గర్భిణి, ఆమె బిడ్డ మరణించిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. కరోనా కేసులతో పాటు ఇతర సీరియస్ రోగులకు కూడ చికిత్స విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది కోర్టు.

కరోనా రోగులతో పాటు గుండె జబ్బులు ఇతర సీరియస్ వ్యాధిగ్రస్తుల  కోసం అంబులెన్స్ లను కూడ సిద్దంగా ఉంచాలని ప్రభుత్వాన్ని ఇదివరకే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

click me!