కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. సీసీఎస్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే కోరుతూ ఆయన నిన్న హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్ సై ఇరు వర్గాల వాదనలను విన్నది. తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. వచ్చే ఏడాది జనవరి రెండో తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని కోరతూ సునీల్ కనుగోలు నిన్న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ తో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు తరపు న్యాయవాది వాదించారు. ఈ కారణంగా ఎఫ్ఐఆర్ లో తన పేరును తొలగించాలని కోరారు. వీడియో స్పూఫ్ లకు సునీల్ కనుగోలుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. సీసీఎస్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు.
undefined
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలు ఏ1 గా ఉన్నాడని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం నాడు తీర్పును వెల్లడించనున్నట్టుగా పేర్కొంది. హైద్రాబాద్ లోని మాదాపూర్ లోని సునీల్ కనుగోలు కార్యాలయంపై సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ తో పాటు మహిళలపై అనుచితంగా పోస్టులు పెడుతున్నారని అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్టుగా సీసీఎస్ పోలీసులు ప్రకటించారు. ఈ పోస్టులు ఎక్కడి నుండి పెడుతున్నారనే విషయమై దర్యాప్తు నిర్వహించగా మాదాపూర్ లో కార్యాలయం ఉందని గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ విషయమై అందిన ఫిర్యాదుల మేరకు ఐదు కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.
also read:సీసీఎస్ పోలీసుల నోటీస్: స్టే ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో సునీల్ కనుగోలు పిటిషన్
ఈ విషయమై గతంలోనే ఒక్కసారి సీసీఎస్ పోలీసులు సునీల్ కనుగోలుకు సీఆర్‌పీసీ 41 ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుకు సంబంధించి తనకు 10 రోజుల సమయం కావాలని సునీల్ కనుగోలు హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులను కోరారు. ఈ నెల 26వ తేదీన సీసీఎస్ పోలీసుల విచారణకు సునీల్ కనుగోలు హాజరు కావాల్సి ఉంది. కానీ సునీల్ కనుగోలు సహా ఆయన టీమ్ సభ్యులు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 27న మరోసారి సీసీఎస్ పోలీసులు సునీల్ కనుగోలుకు నోటీసులు అందించారు.ఈ నోటీసులను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో సీసీఎస్ పోలీసులు కోరారు. దీంతో సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై సోమవారం నాడు తీర్పును వెల్లడించనుంది తెలంగాణ హైకోర్టు.