యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం నాడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ బద్దంగా రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికారు. యాదాద్రి ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్రౌపది ముర్ముకు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న తెలంగాణకు చేరుకున్నారు. ఈ నెల 26న ఏపీలోని శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. అదే రోజున సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు.మ ఈ నెల 27న కేశవ్ మెమెరియల్ విద్యా సంస్థల విద్యార్ధులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. భద్రాచలంలో సీతారామస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. నిన్న హైద్రాబాద్ షేక్ పేటలోని నారాయణమ్మ కాలేజీ విద్యార్ధులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. నిన్న సాయంత్రం హైద్రాబాద్ కు సమీపంలోని ముచ్చింతల్ లో సమాతామూర్తి విగ్రహన్ని దర్శించుకున్నారు.ఇవాళ ఉదయమే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ద్రౌపది ముర్ము సందర్శించుకున్నారు.