కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుంది: బస్సు రూట్లప్రైవేటీకరణపై హైకోర్టు వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Nov 19, 2019, 5:00 PM IST
Highlights

ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్‌ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి రాష్ట్ర ధర్మాసనానికి స్పష్టం చేశారు. 

హైదరాబాద్‌: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరిస్తున్నట్లు తెలంగాణ కేబినెట్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ కేబినెట్ తీర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సవాల్ చేసిన పిల్ పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. 

పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఆ సమయంలో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనములో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అలాంటప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుందో చెప్పాలంటూ పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.  

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్‌ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి రాష్ట్ర ధర్మాసనానికి స్పష్టం చేశారు. 

బస్సురూట్ల ప్రైవేటీకరణ అంశంపై కేబినెట్‌ నిర్ణయ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉందన్నారు.  

జీవో వచ్చాకే కేబినెట్‌ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందని సీఎస్ సీకే జోషి కోర్టుకు తెలిపారు. ఈలోగా కేబినెట్‌ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందని తెలిపారు. 

రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందని సీఎస్ సీకే జోషి తెలిపారు. క్యాబినెట్‌ తీర్మానం నోట్‌ఫైల్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని తెలిపారు. 

క్యాబినెట్‌ నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్‌ వెలువరించాలని, ఆ తర్వాత జీవో జారీ చేస్తేనే క్యాబినెట్‌ అమల్లోకి వస్తుందన్నారు. అప్పటి వరకు ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడం చెల్లదని పిల్ ను డిస్మిస్ చేయాలని హైకోర్టును కోరారు సీఎస్ సీకే జోషి. 

ఈ వార్తలు కూడా చదవండి

#RTC strike సడక్ బంద్ వాయిదా, దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి: సమ్మెపై రేపు తుది నిర్ణయం

click me!