మా సంఘాల జోలికొస్తే అడ్డుకుంటాం: జార్జిరెడ్డి సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 19, 2019, 4:21 PM IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన బజ్ ఉన్న విప్లవ నాయకుడు జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన జార్జి రెడ్డి సినిమాపై వివాదం రాజుకుంటోంది. 


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన బజ్ ఉన్న విప్లవ నాయకుడు జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన జార్జి రెడ్డి సినిమాపై వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా అడ్డుకోవాలంటూ కొన్ని విద్యార్ధి సంఘాలు పట్టుబడుతున్నాయి. తాజాగా గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ లిస్ట్‌లోకి చేరారు.

సినిమా ముసుగులో మా సంఘాలపై ఆరోపణలు చేయకూడదని ఆయన సూచించారు. జార్జిరెడ్డి సినిమాపై తమకు అభ్యంతరం లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు.

Latest Videos

undefined

సినిమాలో నిజానిజాలు మాత్రమే చూపించాలని.. జార్జిరెడ్డి హత్య సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. ఏబీవీపీ నాయకులపై దాడులకు సూత్రధారి జార్జిరెడ్డేనని... తమ సంఘాలను కించపరిస్తే సినిమాను అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరించారు. 

Also Read:వివాదంలో 'జార్జిరెడ్డి'.. రిలీజ్ అడ్డుకుంటామంటూ హెచ్చరికలు!

‘దళం’ సినిమా డైరెక్టర్ జీవన్‌రెడ్డి ఈ ‘జార్జిరెడ్డి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై వివాదం చెలరేగుతోంది. ఏబీవీపీ(అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) నేతలు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

"జార్జ్ రెడ్డి"... దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అటువంటి వ్యక్తి జీవిత చరిత్రతో సినిమా తెరకెక్కుతోంది.

‘దళం’ సినిమా డైరెక్టర్ జీవన్‌రెడ్డి ఈ ‘జార్జిరెడ్డి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై వివాదం చెలరేగుతోంది. ఏబీవీపీ(అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) నేతలు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపించే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

జార్జిరెడ్డిపై కూడా దాదాపు పదిహేను క్రిమినల్ కేసులున్నాయని, ఆయన రౌడీయిజాన్ని కూడా సినిమాలో చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏబీవీపీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ లేనివి ఉన్నట్లు చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అఫీషియల్: 'జార్జి రెడ్డి'తో రామ్ గోపాల్ వర్మ సినిమా..!

జార్జిరెడ్డి హత్య కేసులో ఏబీవీపీ విద్యార్థుల హస్తం లేదని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు మళ్లీ వివాదం చేయడానికి, ఏబీవీపీ నేతలను తప్పుగా చూపించడానికే ఈ సినిమాను తీస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

అయితే తమ సినిమాలో వాస్తవాలనే చూపిస్తున్నామని.. వ్యక్తిగతంగా ఏ ఒక్కరినీ టార్గెట్ చేయలేదని దర్శకుడు జీవన్ రెడ్డి వెల్లడించాడు. ఈ నెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతారని ప్రచారం చేశారు. కానీ దానికి పోలీసులు అనుమతి నిరాకరించారని తెలుస్తోంది.

click me!