సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరుపై జగన్ పిటిషన్: విచారణ ఏప్రిల్‌ 9కి వాయిదా

Published : Feb 12, 2020, 04:37 PM ISTUpdated : Feb 12, 2020, 04:41 PM IST
సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరుపై జగన్ పిటిషన్: విచారణ ఏప్రిల్‌ 9కి వాయిదా

సారాంశం

సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడంపై మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఏప్రిల్ 9వ తేదీకి హైకోర్టు వాయి వేసింది. 


హైదరాబాద్: సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై  విచారణను తెలంగాణ హైకోర్టు  ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీకి  వాయిదా వేసింది.

ఏపీ రాష్ట్రానికి సీఎంగా పరిపాలన వ్యవహారాల్లో నిరంతరం బిజీగా ఉంటున్నందున వ్యక్తిగతంగా సీబీఐ కోర్టుకు హాజరుకాలేమని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేసింది.

Also read:సిబిఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు షాక్

విచారణ ఇంకా పూర్తి కానందున ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఈ పిటిషన్ పై విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే ఈ  పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సాగుతున్న విషయాన్ని సీబీఐ కోర్టుకు తెలపాలని జగన్ తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!