తెలంగాణ సచివాలయం కూల్చివేత: కేసీఆర్‌కు హైకోర్టు షాక్

By narsimha lode  |  First Published Feb 12, 2020, 4:05 PM IST

సచివాలయం కూల్చివేతపై హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర నివేదిక, డిజైన్లు పూర్తి కాకుండానే సెక్రటేరియట్ భవనాలను ఎందుకు కూల్చివేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. 



హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై  హైకోర్టు బుధవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చివేయకూడదని హైకోర్టు ఆదేశించింది.

సచివాలయం కూల్చివేతపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.. నూతన సచివాలయంపై కేబినెట్‌ పూర్తి ఫైనల్ నమూనా నివేదిక తీసుకొని కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశించింది.

Latest Videos

undefined

Also read: కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

సచివాలయం భనవాల నిర్మాణం కోసం ఎలాంటి డిజైన్లు పూర్తి  కాని సమయంలో ఎందుకు సచివాలయం భవనాలను కూల్చివేస్తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తోంది.  సచివాలయ భవనాల కూల్చివేతకు సంబంధించి  డిజైన్లతో పాటు సమగ్ర నివేదికలను ఇవ్వాలని హైకోర్టు  ప్రభుత్వాన్ని గతంలో ఆదేశాలు జారీ చేసింది.

సచివాలయాల కూల్చివేతకు సంబంధించిన నివేదికను ఇంకా పూర్తి చేయలేదని హైకోర్టుకు  బుధవారం నాడు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో  హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
డిజైన్లు, సమగ్రమైన నివేదికలు పూర్తి కాకుండానే భవనాలను కూల్చివేయాలనే తొందర ఎందుకు అని  హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయాన్ని కూల్చివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకొన్న విషయాన్ని  హైకోర్టుకు ప్రభుత్వ తరపున న్యాయవాది తేల్చి చెప్పారు. ఇంతవరకు  టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కూడ డిజైన్లు ఎందుకు పూర్తి చేయలేదని  కోర్టు ప్రశ్నించింది. 
 

click me!