ఈ నెల 31 వరకు వరంగల్ లో 30 పోలీస్ యాక్ట్: వరంగల్ సీపీ తరుణ్ జోషీ

By narsimha lodeFirst Published Aug 26, 2022, 3:52 PM IST
Highlights

వరంగల్ లో ఇవాళ ఉదయం నుండి ఈ నెల 31వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని వరంగల్ సీపీ తరుణ్ జోషీ ప్రకటించారు.  పోలీస్ యాక్ట్ నేపథ్యంలో  ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించినట్టుగా తరేణ్ జోషీ తెలిపారు. 

వరంగల్:ఇవాళ్టి నుండి ఈ నెల 31 వ తేదీ వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్  పరిధిలో సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ మేరకు వరంగల్ సీపీ తరుణ్ జోషీ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ సీపీ తరుణ్ జోషీ  వార్నింగ్ ఇచ్చారు.ప్రజా సంగ్రామ యాత్ర ముగింపును పురస్కరించుకొని  రేపు  వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో సభ నిర్వహించాలని  బీజేపీ తలపెట్టింది.ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.  వరంగల్ లో రేపటి సభకు సంబంధించి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆర్ట్స్ కాలేజీకి సంబందించిన సిబ్బంది కూడా అనుమతిని నిరాకరించారు. 

వరంగల్ లో రేపటి సభకు సంబంధించి అనుమతి కోసం బీజేపీ నేతలు ఇవాళ ఏసీపీ కార్యాలయానికి వెళ్తే సీపీని కలవాలని తమకు సమాచారం ఇచ్చారని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీపీని కలిసేందుకు వెళ్తే సీపీ అందుబాటులో లేరని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

also ead:రేపు వరంగల్ లో బీజేపీ సభ: అనుమతికై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

రేపు తమ సభ నిర్వహణకు ఆటంకం కల్పించే ఉద్దేశ్యంతో వరంగల్ లో 30పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని  టీఆర్ఎస్ సర్కార్ తమ సభను అడ్డుకొనే ప్రయత్నం చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే వరంగల్ లో నిర్వహించే సభకు  అనుమతిని కోరుతూ బీజేపీ నేతలు ఇవాళ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

click me!