వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఊరట: పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By narsimha lode  |  First Published Nov 29, 2022, 4:04 PM IST

వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల  పాదయాత్రకు  తెలంగాణ హైకోర్టు  మంగళవారంనాడు గ్రీన్  సిగ్నల్  ఇచ్చింది.  పాదయాత్రలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు సూచించింది. 


హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు  మంగళవారంనాడు అనుమతిని ఇచ్చింది.  పాదయాత్రలో  అభ్యంతరకర వ్యాఖ్యలు  చేయవద్దని  హైకోర్టు  షరతు విధించింది. పాదయాత్రకు అనుమతి  కోరుతూ  తెలంగాణ హైకోర్టులో  వైఎస్ఆర్‌టీపీ నేత  రవీంద్రనాథ్  రెడ్డి పిటిషన్  దాఖలు చేశారు.  టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం  సృష్టించారని ఆ పిటిషన్ లో  వైఎస్ఆర్‌టీపీ నేత రవీంద్రనాథ్  రెడ్డి  ప్రస్తావించారు. 

వైఎస్ షర్మిల  తన పాదయాత్రలో  సీఎం  కేసీఆర్ తో పాటు ప్రభుత్వ పెద్దలపై  వ్యక్తిగత విమర్శలు చేస్తుందని  అడ్వకేట్  జనరల్  గుర్తు  చేశారు. దీంతో  షరతులతో  కూడిన  అనుమతిని  హైకోర్టు అనుమతిని  ఇచ్చింది.  సీఎం  కేసీఆర్  సహా రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయవద్దని  కూడా  కోర్టు ఆదేశించింది. అంతేకాదు  పాదయాత్రకు మరోసారి  ధరఖాస్తు  చేసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ  చేసింది. 

Latest Videos

undefined

also read:షర్మిల అరెస్ట్.. ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు బయల్దేరేందుకు యత్నం, వైఎస్ విజయమ్మ గృహ నిర్బంధం

నిన్న నర్సంపేట అసెంబ్లీ  నియోజకవర్గంలోని  లింగగిరిలో  వైఎస్  షర్మిలకు చెందిన  బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. అంతే కాదు  షర్మిల  పార్టీకి  చెందిన  వాహనాలపై దాడి చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. ఈ దాడిలో  నాలుగు వాహానలు ధ్వంసమయ్యాయి.   టీఆర్ఎస్  శ్రేణుల దాడిని  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం  చేశాయి.ఈ సమయంలో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది. దీంతో  వైఎస్  షర్మిలను పోలీసులు  అరెస్ట్ చేసి  హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. నిన్న రాత్రి షర్మిలను  లోటస్  పాండ్  లో  వదిలి  నర్సంపేట పోలీసులు వెళ్లిపోయారు.  నర్సంపేటలో టీఆర్ఎస్  శ్రేణుల దాడికి నిరసనగా  ఇవాళ ప్రగతి భవన్ ను ముట్టడించాలని  వైఎస్ఆర్‌టీపీ తలపెట్టింది.    పోలీసుల కళ్లుగప్పి  షర్మిల  లోటస్  పాండ్  నుండి బయటకు వెళ్లింది. సోమాజీగూడ నుండి ధ్వంసమైన  కారుతో  ప్రగతి భవన్ వైపునకు వెళ్లే  ప్రయత్నం చేశారు. పోలీసులు పంజాగుట్టలో  షర్మిలను అడ్డుకున్నారు. కారులోనుండి దిగకుండా  ఆమె  నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడ దించలేదు. దీంతో   పోలీసులు క్రేన్ సహాయంతో  కారుతో సహా  షర్మిలను ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ కు తరలించారు.  ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తర్వాత  కూడా  ఆమె  కారు నుండి దిగలేదు. దీంతో కారు డోర్ లాక్స్ ఓపెన్  చేసి  షర్మిలను  ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు పోలీసులు.

షర్మిలకు మద్దతుగా  వచ్చిన  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు, షర్మిల అభిమానులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.షర్మిలను విడుదల  చేయాలని కోరుతూ  భవనం  ఎక్కి నిరసనకు దిగిన  పలువురు యువకులను కూడా  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

click me!