బీఆర్ఎస్‌ మొండి చేయి: కాంగ్రెస్ టిక్కెట్టు కోసం రేఖా నాయక్ ధరఖాస్తు

By narsimha lode  |  First Published Aug 22, 2023, 12:50 PM IST

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే  రేఖా నాయక్  కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ధరఖాస్తు  చేసింది.


హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేసేందుకు  ఎమ్మెల్యే రేఖా నాయక్ ధరఖాస్తు చేసుకున్నారు. గాంధీ భవన్ లో  రేఖానాయక్  తన ధరఖాస్తు ఫారాన్ని అందించారు. రేఖా నాయక్ పీఏ  గాంధీ భవన్ లో  ధరఖాస్తును అందించారు. రేఖా నాయక్ భర్త శ్యాంనాయక్  నిన్న రాత్రే  కాంగ్రెస్ పార్టీలో చేరారు.   శ్యాంనాయక్ ఆసిఫాబాద్  టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్నారు.

ప్రస్తుతం ఖానాపూర్ నుండి  రేఖా నాయక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.  రేఖా నాయక్  కు  ఈ దఫా బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కలేదు.   రేఖా నాయక్ స్థానంలో  జాన్సన్ నాయక్ కు  బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది.

Latest Videos

undefined

also read:బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ ఎస్టీ కాదు: కంట తడిపెట్టిన రేఖా నాయక్

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  ఖానాపూర్ నుండి రేఖా నాయక్  బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే  ఈ దఫా ఆమెకు  బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు నిరాకరించింది.  బీఆర్ఎస్ జాబితాలో తనకు అవకాశం కల్పించాలని  కోరుతూ  ఆమె  నిన్న  మధ్యాహ్నం వరకు  చివరి ప్రయత్నాలు చేశారు.  ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ నిన్న ఉదయం  ఎమ్మెల్సీ కవితతో భేటీ  అయ్యారు.  తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.  మూడోసారి  తాను  ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మంత్రి పదవి దక్కుతుందని కొందరు తనపై  కక్ష గట్టారని  రేఖా నాయక్ ఆరోపణలు చేస్తున్నారు. అందుకే తనకు టిక్కెట్టు దక్కకుండా చేశారని ఆరోపించారు.

జాన్సన్ నాయక్  ఎస్టీ కాదని  రేఖా నాయక్ చెబుతున్నారు. ఈ విషయాన్ని నిరూపిస్తానని ఆమె  అంటున్నారు.  ఉద్దేశ్యపూర్వకంగానే తనకు టిక్కెట్టు దక్కకుండా  చేశారని ఆమె  తన ప్రత్యర్ధులపై  ఆరోపణలు చేస్తున్నారు.  తెలంగాణ సీఎం కేసీఆర్  నిన్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఏడు స్థానాల్లో మార్పులు చేసి  115 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.  మరో నాలుగు స్థానాల్లో  ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే   ఏడు స్థానాల్లో మార్పుల్లో  ఖానాపూర్ కూడ ఉంది. 

వరుసగా  రెండు దఫాలు ఖానాపూర్ నుండి విజయం సాధించడంతో  ఆమె క్యాడర్ కు అందుబాటులో ఉండడం లేదనే  విమర్శలున్నాయి.  ఇతరత్రా కారణాలను  పరిగణనలోకి తీసుకుని  బీఆర్ఎస్ నాయకత్వం రేఖా నాయక్ కు టిక్కెట్టును నిరాకరించింది.  నిన్న మధ్యాహ్నం కేసీఆర్ బీఆర్ఎస్ జాబితాను విడుదల చేశారు. నిన్న రాత్రి  రేఖా నాయక్ భర్త  కాంగ్రెస్ లో చేరారు.  రేఖా నాయక్ కూడ  త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు.  ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు  ఆమె  బీఆర్ఎస్ లోనే ఉండే అవకాశం ఉందని  సమాచారం. 
 

click me!