కేసీఆర్‌కు హైకోర్టు షాక్: ఏడాదిపాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా కు నో

First Published Jul 6, 2018, 4:30 PM IST
Highlights

ఏడాదిపాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాను పరిగణనలోకి తీసుకోకూడదని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జీవో -7పై ఇద్దరు అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు కోర్టు విచారించింది. 

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి శుక్రవారం నాడు హైకోర్టులో చుక్కెదురైంది.  తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 7 వల్ల స్పోర్ట్స్ కోటా అభ్యర్ధులకు అన్యాయం జరుగుతోందని  ఇద్దరు అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు  ఏడాదిపాటు ప్రొఫెషనల్‌ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాను పరిగణనలోకి తీసుకోవద్దని సూచించింది.

స్పోర్ట్స్ కోటా అభ్యర్ధులకు  అన్యాయం జరుగుతుందని  అభ్యర్ధులు నీలేరాయ్, కాలేశ్రేయలు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై  హైకోర్టు  శుక్రవారం నాడు విచారణ చేపట్టింది.  ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాను ఏడాదిపాటు పరిగణనలోకి తీసుకోకూడదని  సూచించింది. 

ఇంజనీరింగ్, మెడికల్,  అగ్రికల్చర్‌తో పాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరేందుకు స్పోర్ట్స్ కోటా లో రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. అయితే స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు చోటు చేసుకొన్నాయనే ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో  ఈ విషయమై విచారణ సాగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై విచారణకు ఆదేశించింది. ఇదే సమయంలో ఇద్దరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.  దీంతో హైకోర్టు ఏడాది పాటు స్పోర్ట్స్ కోటా కింద ప్రోఫెషనల్ కోర్సులను పరిగణనలోకి తీసుకోకూడదని ఆదేశించింది.

click me!