Telangana Constable Recruitment: తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు బ్రేకులు పడ్డాయి. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని, అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ..పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)ని ఆదేశించింది.
Telangana Constable Recruitment : తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు బ్రేకులు పడ్డాయి. మెయిన్స్ (తుది) పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి, అందరికీ 4 మార్కులు కలిపాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేయాలని , అనంతరమే నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు.. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు సూచించింది. తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ మెయిన్స్ పరీక్ష ప్రశ్నపత్రంలో 122, 130, 144 ప్రశ్నలను తెలుగులో అనువదించలేదని, అలాగే.. 57 ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని హైకోర్టు రిక్రూట్ మెంట్ బోర్డును ఆదేశించింది.
ప్రశ్నలను తెలుగులో ట్రాన్స్ లేట్ చేయకపోవడాన్నీ తీవ్ర తప్పిదంగా పరిగణించింది హైకోర్టు. ఆ 4 ప్రశ్నలను తొలగించి, తిరిగి మూల్యాంకనం నిర్వహించి ఫలితాలను విడుదల చేయాలని, ఆ తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు పేర్కొంది. దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే.. కానిస్టేబుల్ తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబరు 4న విడుదల చేసింది. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది సెలక్ట్ కాగా.. 12,866 మంది పురుషులు.. 2, 884 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని బోర్డు ప్రకటించింది. తాజాగా హైకోర్టు తీర్పుతో మళ్లీ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైకోర్టు నిర్ణయం పట్ల ఎంపికైన అభ్యర్థులు షాక్ అవుతున్నారు. ఇక రాష్ట్రంలో ఏ ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి కావడం లేదనీ, కేసులు.. కోర్టులు.. తీర్పులు అంటూ తిరగాల్సి వస్తుందని నిరుగ్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ఎస్పీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దు అయ్యింది. ఇక గ్రూప్-2 నిరవధిక వాయిదా పడింది. మరోవైపు.. గ్రూప్ 4 పరీక్ష నిర్వహించి.. నెలలు గడుస్తున్న ఫలితాలు ఇంకా వెలువడలేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. మరోవైపు.. అన్యూహంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చి పడింది. దీంతో ఇప్పట్లో ఉద్యోగాల భర్తీ లేనట్లేని నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.