నివేదిక ఇవ్వండి: వైద్య సిబ్బందికి కరోనా, తెలంగాణ హైకోర్టు సీరియస్

By narsimha lodeFirst Published Jun 4, 2020, 12:46 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో పలువురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఈ నెల 8వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఈ నెల 8వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలోని మూడు మెడికల్ కాలేజీల్లో పలువురు వైద్య విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. దీంతో సుమారు 600 మందిని బుధవారం నాడు క్వారంటైన్ కు తరలించారు.

also read:మూడు మెడికల్ కాలేజీల్లో కరోనా కలకలం: 600 మంది క్వారంటైన్‌కి తరలింపు

ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది.వైద్య సిబ్బందికి కరోనా ఎలా సోకిందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి  రక్షణ కిట్స్ అందిస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. రక్షణ కిట్లు అందిస్తే  ఎలా వైరస్ వ్యాప్తి చెందిందని న్యాయమూర్తి ప్రశ్నించారు.

వైద్య సిబ్బందికి రక్షణ కిట్లు అందించాలని హైకోర్టు ఆదేశించినా కూడ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని హైకోర్టుకు పిటిషనర్ తరపున న్యాయవాది తెలిపారు.

వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకడంపై హైకోర్టు సీరియస్ అయింది.ఈ విషయమై ఈ నెల 8వ తేదీలోపుగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు.తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,020కి చేరుకొన్నాయి. నిన్న ఒక్కరోజే  129 కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదౌతున్నాయి.

click me!