మధుసూధన్ చనిపోయాడా లేదా రేపటిలోపుగా చెప్పండి: ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Jun 4, 2020, 12:20 PM IST
Highlights

 గాంధీ ఆసుపత్రిలో  కరోనా రోగి మధుసూదన్  మరణించారా లేదా అనే విషయాన్ని తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధుసూధన్ మరణిస్తే కుటుంబసభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది.


హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో  కరోనా రోగి మధుసూదన్  మరణించారా లేదా అనే విషయాన్ని తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధుసూధన్ మరణిస్తే కుటుంబసభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది.

గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగి మధుసూధన్ మరణంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త మధుసూదన్ ఆచూకీ తెలియడం లేదని  మధుసూధన్ భార్య మాధవి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు గత నెల 21వ తేదీన ఫిర్యాదు చేసింది.

also read:షాక్ తింటుందని భార్యకు చెప్పలేదు: కరోనా మృతుడి అంత్యక్రియలపై ఈటల

మధుసూదన్ మే 1వ తేదీన గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. గాంధీ ఆసుపత్రి సిబ్బంది సూచన మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మధుసూధన్ అంత్యక్రియలను నిర్వహించారు.

మధుసూధన్ తండ్రి ఈశ్వరయ్య కూడ కరోనాతో మరణించాడు. మధుసూధన్ భార్య మాధవి కూడ ఇదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొంది.ఆసుపత్రిలో కోలుకొంటున్న మాధవికి భర్త చనిపోయిన విషయాన్ని చెప్పలేదని మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 21వ తేదీన స్పష్టం చేశారు.

అయితే ఈ విషయమై ప్రభుత్వం చెప్పిన సమాధానంతో మాధవి తృప్తి చెందలేదు. న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించింది.

ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించింది. మధుసూధన్ మరణించారా లేదా అనే విషయాన్ని ఈ నెల 5వ తేదీ లోపుగా చెప్పాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఒకవేళ కరోనాతో మధుసూధన్ మరణిస్తే కుటుంబసభ్యులకు ఎందుకు చెప్పలేదని హైకోర్టు ప్రశ్నించింది.


 

click me!