తెలంగాణ తగ్గిన కరోనా: ఇక ప్రత్యక్షంగా కేసుల విచారణకు హైకోర్టు నిర్ణయం, కానీ ఆ జిల్లాల్లో...

By narsimha lodeFirst Published Jul 13, 2021, 5:00 PM IST
Highlights


తెలంగాణ హైకోర్టు ఆన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో  కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో  ప్రత్యక్షంగా కేసుల విచారణను ఈ నెల 19 నుండి చేపట్టాలని నిర్ణయం తీసుకొంది. ఉద్యోగులు వంద శాతం హాజరుకావాలని ఆదేశించింది.  

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కేసులు  తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్ ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు నిర్ణయం తీసుకొంది. కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులంతా విధులకు హాజరుకావాలని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు హైకోర్టు రాష్ట్రంలోని అన్ని కోర్టులకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో సగం మంది ఉద్యోగులు మాత్రమే హాజరౌతున్నారు. వంద శాతం  ఉద్యోగులు ప్రతి రోజూ విధులకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం రోజు విడిచి రోజు ఉద్యోగులు విధులకు హాజరౌతున్నారు.ఈ నెల 19 నుండి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు  నిర్ణయం తీసుకొంది.  

ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు హైకోర్టులో ఈ నెల 31 వరకు ఆన్‌లైన్ విధానమే కొనసాగుతోంది. ఆ తర్వాత ప్రత్యక్షంగా కేసుల విచారణను కొనసాగించాలని హైకోర్టు భావిస్తోంది.కరోనా కారణంగా ఆన్ లైన్ పద్దతిలోనే కేసుల విచారణను కొససాగిస్తున్న విషయం తెలిసిందే.  కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆన్ లైన్ పద్దతిలో కేసుల విచారణ సాగిస్తున్నారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో ఒక నేరుగా కేసుల విచారణ చేపట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొంది. 

click me!