దేశ సరిహద్దును కాపాడా.. నా ఇంటి బోర్డర్‌ రక్షించుకోలేకపోతున్నా: భూకబ్జాపై రిటైర్డ్ మేజర్ ఆవేదన

By Siva KodatiFirst Published Jul 13, 2021, 4:50 PM IST
Highlights

దేశ సరిహద్దును ప్రాణాలకు తెగించి కాపాడానని, కానీ తన ఇంటి సరిహద్దును కాపాడలేకపోతున్నానంటూ రిటైర్డ్ ఆర్మీ మేజర్ పీటీ చౌదరి వాపోయారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత నర్సయ్య తమ స్థలాన్ని ఆక్రమించారని ఆయన ఆరోపించారు.

శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత నర్సయ్య తమ స్థలాన్ని కబ్జా చేశారని రిటైర్డ్ మేజర్ పీటీ చౌదరి ఆరోపించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 14లో తన స్థలాన్ని ఆక్రమించారని ఆయన అన్నారు. అంగ, అర్థ బలంతో బెదిరిస్తున్నారని పీటీ చౌదరి వాపోయారు. కోర్టు స్టే ఇచ్చినా కూడా ఫేక్ ఆర్డర్లు చూపించి బెదిరిస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఇది చాలదన్నట్లు 129/56 సర్వే నెంబర్‌ ప్రాంతంలో 40 ఏళ్లుగా రోడ్డు వుందని .. ఇప్పుడొచ్చి అది రోడ్డు కాదని నా స్థలం అంటున్నారని శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ అధినేతపై రిటైర్డ్ మేజర్ మండిపడ్డారు.

దాదాపు నెలల రోజుల పాటు నానా హడావిడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సరిహద్దును ప్రాణాలకు తెగించి కాపాడానని, కానీ తన ఇంటి సరిహద్దును కాపాడలేకపోతున్నానంటూ పీటీ చౌదరి వాపోయారు. తనకు కోవిడ్ పాజిటివ్ రావడంతో నెలన్నర పాటు ఆసుపత్రిలోనే వున్నానని తెలిపారు. ఆ సమయంలో తన భార్య, కుమారుడు వ్యవహారం చూశారని చెప్పారు. 

click me!