గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌పై ఈ నెల 4 వరకు యథాతథస్థితి: తెలంగాణ హైకోర్టు

By narsimha lodeFirst Published Oct 1, 2021, 2:58 PM IST
Highlights

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌  విషయమై ఈ నెల 4 వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను బాట సింగారం గ్రామానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.ఈ నిర్ణయాన్ని ఫ్రూట్ మార్కెట్ కమీషన్ ఏజంట్స్ అసోసియేషన్ హైకోర్టులో సవాల్ చేసింది.

హైదరాబాద్: గడ్డి అన్నారం (Gaddiannaram) పండ్ల (fruit) మార్కెట్‌  (market) విషయమై ఈ నెల 4 వ తేదీ వరకు యథాతథస్థితిని (status quo )కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (telangana high court) శుక్రవారం నాడు ఆదేశించింది.

గడ్డి అన్నారం ప్రూట్ మార్కెట్ ను బాట (batasingaram)సింగారానికి తరలించడాన్ని ఫ్రూట్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. బాట సింగారం వద్ద ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలున్నాయని ప్రభుత్వం తరపున న్యాయవాది ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

అయితే గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో ఉన్న సౌకర్యాలపై నివేదిక  ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థను హైకోర్టు ఆదేశించింది.ఈ  పిటిషన్ పై విచారణను ఈ నెల 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.ఫ్రూట్ మార్కెట్ ను గడ్డి అన్నారంలోనే కొనసాగించాలని ఈ మార్కెట్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యాపారులు, కమీషన్ ఏజంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
 

click me!