అడవుల్లో అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు: పోడు భూముల వివాదంపై కేసీఆర్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 1, 2021, 2:57 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా కెనడాలోనే  అత్యధిక మొక్కలు వున్నాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ వర్షా కాల సమావేశాల సందర్భంగా గురువారం ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్ధితులు మారిపోయాయని కేసీఆర్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కెనడాలోనే  అత్యధిక మొక్కలు వున్నాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ వర్షా కాల సమావేశాల సందర్భంగా గురువారం ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్ధితులు మారిపోయాయని కేసీఆర్ అన్నారు. ఐదు వేల కి.మీ పరిధిలో చైనా వేల, కోట్ల మొక్కులు నాటిందని సీఎం గుర్తుచేశారు. అలాంటి కార్యక్రమాలు మనకు ఆదర్శమని కేసీఆర్ తెలిపారు. మనకళ్ల ముందే అడవుల ధ్వంసం జరిగిందని.. గతంలో 10 వేల మొక్కల సమీకరణ పెద్ద యజ్ఞంలా వుండేదని కేసీఆర్ గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ,హెచ్‌ఎండీఏ పరిధిలో మొక్కల నాటే  కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్లు  కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు హరితహారం  కోసం రూ.6,556 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో టార్గెట్‌ను మించి మొక్కలు నాటామని కేసీఆర్ పేర్కొన్నారు.  ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ  వుందన్నారు. 

అక్కడక్కడా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. అడవుల మీద ఆధారపడి జీవించే గిరిజనులతో ఘర్షణలకు దిగుతున్నారని సీఎం మండిపడ్డారు. ఈ తరహా ఘటనలు మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై యూపీఏ  ప్రభుత్వం హాయంలో చట్టం తెచ్చారని .. పరిమితులు  పెట్టారని కేసీఆర్ గుర్తుచేశారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేవారికి రక్షణ ఉండాలన్నారు. ఎట్టి  పరిస్ధితుల్లో ఫారెస్ట్ కింద నోటిఫై అయిన భూమి యాజమాన్యం మారదని కేసీఆర్ కోర్టు తీర్పులను గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వీటిని కేంద్రం రూపొందించిందని కేసీఆర్ తెలిపారు. 

click me!