పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇల్లు, విద్యాసంస్థలు వున్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతించారని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకొని అనుమతిచ్చారో .. ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి పది దాటితే పబ్స్‌లో ఎలాంటి సౌండ్ పెట్టరాదని స్పష్టం చేసింది. లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతించాలని అధికారులను ఆదేశించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి సౌండ్ పెట్టొద్దని హైకోర్టు సూచించింది. పబ్‌లలో రాత్రిపూట కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇల్లు, విద్యాసంస్థలు వున్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతించారని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకొని అనుమతిచ్చారో .. ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.