సినిమా టికెట్ల ధరలు.. విభజన తర్వాత చర్యలేంటీ: తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు

By Siva KodatiFirst Published Jul 27, 2021, 3:30 PM IST
Highlights

తెలంగాణలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు విచారణ జరిపింది.  కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయానికి కోర్టుకు తెలపాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని సినిమాటోగ్రఫీ, హోంశాఖ సెక్రటరీలను ఆదేశించింది. 
 

తెలంగాణలో సినిమా టికెట్ల ధరలపై మంగళవారం విచారణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత సినిమా టికెట్ ధరలపై ఎలాంటి రూల్స్ రూపొందించారని ప్రశ్నించింది. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కమిటీ సూచనలను ప్రభుత్వానికి సూచించిందని కోర్టుకు వెల్లడించారు. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయానికి కోర్టుకు తెలపాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని సినిమాటోగ్రఫీ, హోంశాఖ సెక్రటరీలను ఆదేశించింది. 

అంతకుముందు థియేటర్ యజమానులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే మల్టీప్లెక్స్, కమర్సియల్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. అలాగే ఈ నెల 23 నుంచి థియేటర్ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతించింది. 

ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో థియేటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ వెల్లడించింది. ఈ నెల 23 నుంచి సినిమాల ప్రదర్శన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలంగాణా అంతటా 100 శాతం ఆక్యుపెన్సితో థియేటర్లు ప్రారంభం కానున్నాయి. ఇటీవల రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫిలించాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు

click me!