9 వరకు మార్చురీలోనే ఉంచండి: దిశ నిందితుల అంత్యక్రియలపై హైకోర్టు కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Dec 6, 2019, 9:44 PM IST
Highlights

దిశ నిందితుల అంత్యక్రియలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 రాత్రి 8 గంటల వరకు నిందితుల మృతదేహాలను భద్రపరచాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. 

దిశ నిందితుల అంత్యక్రియలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 రాత్రి 8 గంటల వరకు నిందితుల మృతదేహాలను భద్రపరచాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

ఈ నెల 9న ఉదయం 10.30 గంటలకు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. సాయంత్రం 6 గంటలకు అందిన వినతిపత్రంపై న్యాయస్థానం అత్యవసరంగా స్పందించింది.

అలాగే శవపరీక్ష వీడియో, ఫోరెన్సిక్ నివేదిక, తదితర ఆధారాలను శనివారం సాయంత్రంలోగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్జికి ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కొన్ని మహిళా సంఘాలతో పాటు వ్యక్తులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. 

దిశ నిందితుల అంత్యక్రియల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పోస్ట్‌మార్టం అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలోనే నిందితుల మృతదేహాలు ఉన్నాయి. ఎన్‌హెచ్ఆర్సీ పర్యటన తర్వాతే అంత్యక్రియలు ఉండే అవకాశాలు ఉండవచ్చునని తెలుస్తోంది.

అంతకు ముందు దిశ నిందితుల అంత్యక్రియలను రాత్రి లోగా నిర్వహించాలని భావిస్తున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. నారాయణ్‌పేట్ జిల్లా గుడిగండ్లకు చెందిన నిందితులు మహ్మద్ పాషా, నవీన్, శివ, చెన్నకేశవుల అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించేందుకు గాను పోలీసులు వ్యవసాయ పొలంలో గుంతలు తీశారు.

ఈ విషయం తెలుసుకున్న ఆ భూమి యజమానులు తమ పట్టా భూముల్లో అంత్యక్రియలు ఏంటని అడ్డుకున్నారు. గుడిగండ్లలో స్మశానం లేదు.. గ్రామ శివార్లలోని సర్వే నెం 12కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలోనే మరణించిన వారిని ఖననం చేసేవారు.  

Also Read:తెలంగాణలో సంచలనం రేపిన ఎన్ కౌంటర్లు ఇవే: హీరో సజ్జనార్

ఈ విషయంపై పోలీసులకు అవగాహన లేకపోవడంతో ప్రోక్లెయిన్‌లతో తవ్వకాలు జరిపారు. భూ యజమానులు దీనిపై అభ్యంతరం తెలపడంతో పోలీసులు మరో చోట ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:Justice For Disha:ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ వివరణ ఇదీ...

నిందితుల్లో ఏ-1 మహ్మాద్ ఆరిఫ్ స్వగ్రామం జక్లేర్, మిగిలిన ముగ్గురు నిందితులు చెన్నకేశవులు, శివ, నవీన్‌లు గుడిగండ్ల గ్రామానికి చెందినవారే. మరోవైపు ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి నిందితుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు

click me!