
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున భార్యాభర్తలు హత్యకు గురయ్యారు. నిద్రలోనే వారిని హత్య చేశారు. ఉదయంపూట రక్తం మడుగులో శవాలు పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వేసవి కాలం కావడంతో దంపతులు ఆరు బయట నిద్రిస్తున్నారు. వారు హత్యకు గురయ్యారు.
వారిని ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారనే విషయాలు తెలియలేదు. పోలీసులు కారణం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా నేరేడుగొండ మండలంలోని బుగ్గ తండాలో ఈ జంట హత్యలు జరిగాయి.
వివరాలు తెలియాల్సి ఉంది.