బీఆర్కేఆర్ భవన్లో కరోనా కలకలం ! 15 మందికి పాజిటివ్... !!

Published : Jan 18, 2022, 01:37 PM IST
బీఆర్కేఆర్ భవన్లో కరోనా కలకలం ! 15 మందికి పాజిటివ్... !!

సారాంశం

జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు పీఎస్ లతో సహా మరికొంత మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 

హైరదాబాద్ : హైదరాబాద్ లోని BRK Bhavanలో కరోనా కలకలం రేపుతోంది. సాధారణ పరిపాలన, విద్యాశాఖలతో సహా పలు విభాగాల్లో 15 మందికి పైగా coronavirus సోకింది. ఐఏఎస్ అధికారి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానీయకు positiveగా నిర్థారణ అయ్యింది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు పీఎస్ లతో సహా మరికొంత మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ల కూడా కరోనా కలకలం రేపుతోంది.  andhrapradesh లో ఒక్కొక్కరిగా రాజకీయనాయకులు covid 19 బారిన పడుతున్నారు. కొడాలి నాని, వంగవీటి రాధలు మొదట కరోనా బారి పడ్డారు. ఆ తరువాత వరుసగా ఒక్కొక్కరే కరోనా బారిన పడుతున్నారు. నిన్న లోకేష్, నేడు చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమలు కరోనా బారిన పడగా... ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసంలోనూ కరోనా కలవరం రేగింది. మంత్రి భార్య శచీదేవి కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో టెస్ట్ చేయించేకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

అయితే మిగతా ఎవ్వరికీ పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా వైసీపీ నేత.. డిప్యూటీ సీఎం, రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి  Dharmana Krishnadasకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన మంగళవారం ఉదయం విడుదల చేసిన ఒక  ప్రకటనలో పేర్కొన్నారు. తనకు లక్షణాలు పెద్దగా ఏవీ లేవని అయినప్పటికీ Home Isolationను పాటిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, అంతకు ముందే సంక్రాంతి సందర్భంగా క్యాంపు కార్యాలయానికి కూడా సెలవు ప్రకటించామని తెలిపారు. 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు virus సోకిందని, అయితే ఎవరూ అందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇటీవల తనను కలిసినవారు కూడా covid tests చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దాసన్నకు పాజిటివ్ : ముఖ్యమంత్రి జగన్ 
అమరావతిలో మంగళవారం శాశ్వత భూహక్కు భూరక్ష పథకాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దాసన్నకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సమావేశానికి  హాజరుకాలేకపోయారని అన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తారని, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శాశ్వత భూ హక్కు రక్ష పథకంలో భాగంగా రీ సర్వే పూర్తయిన పలు గ్రామాల భూ రికార్డులను ప్రజలకు అంకితం చేస్తున్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ సీఎం జగన్ తో పాటు హాజరు కావాల్సి ఉంది.

ఇక, Vijayawada ప్రభుత్వ ఆస్పత్రిలో Corona virus కలకలం రేగింది. ఇక్కడ మొత్తం 50 మందికి Corona positive గా నిర్థారణ అయ్యింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ తో సహా 25 మంది వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి కరోనా సోకింది. వైద్యులకు కరోనా సోకడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu