రెసిడెన్షియల్ ఏరియాల్లో పబ్‌లు.. ఈ న్యూసెన్స్ ఎలా కంట్రోల్ చేస్తారు : తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ప్రశ్నలు

Siva Kodati |  
Published : Dec 29, 2021, 04:22 PM IST
రెసిడెన్షియల్ ఏరియాల్లో పబ్‌లు.. ఈ న్యూసెన్స్ ఎలా కంట్రోల్ చేస్తారు : తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ప్రశ్నలు

సారాంశం

నివాస ప్రాంతాల్లో పబ్‌లు, క్లబ్బులు (pubs in hyderabad) నిర్వహించడంపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు (telangana high court) బుధవారం విచారణ జరిపింది. సౌండ్ పొల్యూషన్ ఎక్కువైందంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్లు. ఇళ్ల మధ్యలో పబ్‌ల వల్ల ట్రాఫిక్, సౌండ్ పొల్యూషన్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.

నివాస ప్రాంతాల్లో పబ్‌లు, క్లబ్బులు (pubs in hyderabad) నిర్వహించడంపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు (telangana high court) బుధవారం విచారణ జరిపింది. సౌండ్ పొల్యూషన్ ఎక్కువైందంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్లు. ఇళ్ల మధ్యలో పబ్‌ల వల్ల ట్రాఫిక్, సౌండ్ పొల్యూషన్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. న్యూసెన్స్ తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు నిలదీసింది. శబ్ధ కాలుష్యం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై యాక్షన్ ప్లాన్ ఏంటని ప్రశ్నించింది. యాక్షన్ ప్లాన్ వివరాలు ఇచ్చేందుకు అడిషనల్ ఏజీ కోర్టును సమయం కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రేపటిలోగా పూర్తి వివరాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. అయితే చర్యలు చెప్పడానికి సమయం కోరారు అడిషనల్ ఏజీ. న్యూ ఇయర్ వేడుకలకు ముందే వివరాలు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. 

కాగా.. నివాస ప్రాంతాల్లో పబ్‌ల విషయమై జూబ్లీహల్స్ రెసిడెన్షియల్ అసోసియేష్ ఇటీవల  Telangana High courtలో ఇటీవలనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు పబ్ ల యజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. జనావాసాల మధ్య పబ్‌లు నడుపుతున్నారని.. నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 2000 నిబంధనలు ఉల్లంఘించారని కోర్టుకు గత బుధవారం విచారణ సందర్భంగా రెసిడెన్షియల్ అసోషియేషన్ తెలిపింది. 

Also Read:నిబంధనలకు విరుద్దంగా పబ్‌లు నడిపితే చర్యలు: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ వార్నింగ్

నగరంలోని  800 జూబ్లీ,హైలైఫ్, బ్రెవింగ్ కంపెనీ, పర్జీ కెఫే, అమ్నిషీయా లాంజ్, డైలీ డోస్ బార్ హాఫ్, డర్టీ మార్టినీ కిచెన్ , బ్రాడ్ వే పబ్, మ్యాకే బ్రో వరల్డ్ కాపీ బార్, పబ్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.నగరంలోని పలు పబ్‌లలో అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకొంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి.  మైనర్లకు కూడా పబ్‌లలో మద్యం అమ్మిన దృశ్యాలు కూడా మీడియాలో ప్రసారం జరిగింది. పబ్‌లలో డ్రగ్స్ కూడా విక్రయించినట్టుగా ఆరోపణలు కూడా వచ్చాయి. హైకోర్టు పబ్ లకు నోటీసులు జారీ చేయడంతో అప్పటి హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ఈ విషయమై స్పందించారు.

పబ్‌ల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. కొన్ని పబ్‌లపై ఫిర్యాదులు అందాయన్నారు. Pub ల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని ఆయన కోరారు. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసకొంటామని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. రూల్స్ పాటించకుండా అర్ధరాత్రి వరకు నడిపే పబ్‌లపై చర్యలు తీసుకొంటామన్నారు. పబ్‌ల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని సీపీ తెలిపారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకొంటామని  ఆయన హెచ్చరించారు. 
 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu