నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబానికి పరామర్శ..

Published : Dec 29, 2021, 02:30 PM IST
నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబానికి పరామర్శ..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం నల్గొండ (nalgonda) జిల్లాలో పర్యటిస్తున్నారు. నల్గొండ పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్ (CM KCR).. పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ నివాసానికి వెళ్లారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం నల్గొండ (nalgonda) జిల్లాలో పర్యటిస్తున్నారు. నల్గొండ పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్ (CM KCR).. పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ నివాసానికి వెళ్లారు. గాదరి కిశోర్‌ కుమార్‌ (Gadari Kishore kumar)  తండ్రి మారయ్య ఇటీవల మరణించారు. దీంతో ఆయన కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. మారయ్య దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసి తిరిగి హైద‌రాబాద్ కు ప్ర‌యనం అవుతారు.  సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు మారయ్యకు నివాళులర్పించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?