ఎన్ని పరువు హత్యలు జరిగాయి.. మీరేం చేశారు: తెలంగాణ డీజీపీని ప్రశ్నించిన హైకోర్టు

By Siva KodatiFirst Published Apr 1, 2021, 4:48 PM IST
Highlights

పరువు హత్యలపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు పరువు హత్యలపై న్యాయస్థానానికి డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదిక సమర్పించారు. పరువు హత్యలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు డీజీపీ తెలిపారు. 

పరువు హత్యలను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నామని నివేదికలో వెల్లడించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తున్నామని ఆయన హైకోర్టుకు నివేదించారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎలా అమలు చేశారో తెలపాలని డీజీపీని ఆదేశించింది. ఇప్పటి వరకు పరువు హత్యలు ఎన్ని జరిగాయని న్యాయస్థానం ప్రశ్నించింది.

దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సామాజిక కార్యకర్త సాంబశివరావు దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఆగస్టు 5కి హైకోర్టు వాయిదా వేసింది.

click me!