భౌతిక వాదనకు సిద్దం కండి...: ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Sep 23, 2021, 1:44 PM IST
Highlights

చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు భౌతిక వాదనలు వినిపించడాన్ని సిద్దంగా వుండాలని ఆదేశించారు.

హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యే పౌరసత్వం కేసులో పలు కీలక విషయాలు, కేసు డైరీని   గురించి చర్చించాల్సి ఉన్నందున బౌతికంగానే వాదనలు వినాలని చెన్నమనేని తరపు న్యాయవాది రామారావు కోర్టును కోరారు. అయితే దీనిపై పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేసులో చాలా జాప్యం జరుగుతోందని... వెంటనే కోర్ట్ వాదనలు పూర్తిచేసి తీర్పు ఇవ్వాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర ర్రావు, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు కూడా ఎమ్మల్యే పౌరసత్వంపై భౌతికంగా వాదనలు వినిపించడాన్ని సమర్ధించారు. దీంతో అనేక రకమైన అఫిడవిట్ లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున వాదనలకు అన్ని పార్టీలు భౌతికంగా వాదన చేయడానికి సిద్ధంగా ఉండాలన్న హైకోర్ట్ తెలిపారు. అక్టోబర్ 21న భౌతిక వాదనలు జరుపుతామన్న హైకోర్టు తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది.

read more  లాభాలు రాకుంటే 4 నెలల్లో ఆర్టీసీ ప్రైవేట్ పరమే.. కేసీఆర్ ఇదే చెప్పారు: బాజీరెడ్డి గోవర్థన్ సంచలనం

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని ఆది శ్రీనివాస్  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గతకొంతకాలంగా విచారణ జరుగుతోంది. కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు, చెన్నమనేని తరపున అడ్వకేట్ రామారావు, ఆది శ్రీనివాస్ తరుపున రవికిరణ్ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. 

గతంలో జరిగిన వాదనలో చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని ఎఎస్‌జీ రాజేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఓసీఐ ధరఖాస్తులోనూ జర్మనీ పౌరుడుగా ప్రస్తావించారని జర్మనీ పాస్ పోర్టును 2023 వరకు పునరుద్దరించుకొన్నారని న్యాయవాది రవికిరణ్ వాదించారు. మరో వైపు చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొన్నారని ఆయన తరపు న్యాయవాది రామారావు వాదించారు.  

ప్రస్తుతం వర్చువల్ కోర్ట్ నడుస్తున్నందున ఫిజికల్ కోర్టులో పూర్తి వాదనలు వినిపిస్తామని చెన్నమనేని తరపు న్యాయవాది ఎప్పటినుండో కోరుతున్నారు. తాజాగా దీనికి అంగీకరించిన తెలంగాణ హైకోర్టు ఇకపై ఈ కేసును భౌతికంగా వాదించనున్నట్లు వెల్లడించింది. 

click me!