
ఈ నెల 26వ తేదీన రాహుల్ అనే జిమ్ ట్రైనర్ రాజేంద్రనర్ లో హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని మొదట భావించినా.. తాజాగా అలాంటిదేమీ లేదని పోలీసులు గుర్తించనట్టు తెలుస్తోంది.
‘ముస్లిం మహిళతో కలిసి తిరగడానికి నీకెంత ధైర్యం’- అహ్మదాబాద్ లో హిందూ యువకుడిపై దాడి.. వీడియో వైరల్
హత్య జరిగిన రోజు రాహుల్ తనతో నిశ్చితార్థం జరిగిన యువతితో వీడియో కాల్ మాట్లాడాడని పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ హత్య కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న నలుగురు నిందితులను రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ వ్యక్తిగత కారణలే ఈ హత్యకు దారి తీసినట్టు తెలుస్తోంది.
ఢిల్లీలో శివలింగం ఆకారంలో ఫౌంటెన్లు ఏర్పాటు - ఆప్ పై మండిపడ్డ బీజేపీ..
రాహుల్ తో జరిగిన చిన్న పాటి ఘర్షణే ఈ హత్యకు కారణమయ్యిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపారు. జిమ్ ట్రైనర్ ను హత మార్చాలని నిందితులు పక్కగా రెక్కీ నిర్వహించారు. రాహుల్ బలం ఏంటో ముందే అంచనా వేసిన దుండుగులు.. పెప్పర్ స్ప్రేను తమ వెంట తీసుకొని వచ్చారు.
జిమ్ లో వర్కౌట్ పూర్తి చేసుకొని రాహుల్ లిఫ్ట్ లో కిందకు వచ్చారు. వెంటనే ఒక్క సారిగా దుండుగులు తమ వెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను కొట్టారు. దీంతో అతడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రాహుల్ తేరుకొని పరిస్థితిని అర్థం చేసుుకునే లోపు దారుణానికి ఒడిగట్టారు. అతడిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు.