జూన్‌ 8 నుండి తెలంగాణలో టెన్త్ పరీక్షలు, జీహెచ్ఎంసీలో ఎగ్జామ్స్‌ కు నో

By narsimha lodeFirst Published Jun 6, 2020, 5:15 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుండి టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుండి టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

అయితే జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం టెన్త్ పరీక్షల నిర్వహించకూడదని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కూడ ఎస్ఎస్‌సీ పరీక్షలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

also read:పరీక్షలు నిర్వహించకుండా గ్రేడింగ్ ఇవ్వొచ్చా: టెన్త్ పరీక్షలపై తెలంగాణహైకోర్టు

ఈ రెండు ప్రాంతాల్లో కూడ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. అయితే కరోనా కారణంగా విద్యార్థులు మరణిస్తే  ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని విద్యార్థులను అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.

సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులను కూడ రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకొంది.ఈ విషయాన్ని హైకోర్టుకు  తెలిపింది.

ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విచారణను తిరిగి ప్రారంభించిన హైకోర్టు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ నెల 8వ తేదీ నుండి టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. 

జీహెచ్ఎంసీ పరిధితో పాటు, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా హాట్‌స్పాట్స్ ఎక్కువగా ఉన్నందున  ఇక్కడ పరీక్షల నిర్వహణకు హైకోర్టు  అనుమతి ఇవ్వలేదు.ప్రశ్నాపత్రం మళ్లీ మళ్లీ తయారు చేయడం ఇబ్బంది అవుతోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తెచ్చారు.

అయితే విద్యార్థుల ప్రాణం ముఖ్యమా సాంకేతిక అంశాలు ముఖ్యమా అని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగితే పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

click me!