తలాతోకా ఉండదు: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్

By telugu teamFirst Published Jun 6, 2020, 1:58 PM IST
Highlights

నీటి పారుదల ప్రాజెక్టులపై కాంగ్రెసు నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి మాటలకు తలాతోక ఉండదని గుత్తా అన్నారు.

హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టులపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు శాన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భాష తాను మాట్లాడబోనని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలకు తలాతోకా ఉండదని ఆయన అన్నారు. 

గత ప్రభుత్వాల హయాంల్లో ఎమ్మెల్యెలుగా, మంత్రులుగా ఉండి కూడా నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఆయన కాంగ్రెసు నాయకులను విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద పోతిరెడ్డిపాడుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడలేదని ఆయన అన్నారు.  

దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని కొంత మంది ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రాంతానికి చెందిన వాడిగా నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాపై ఉందని ఆయన అన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ కు  సంబంధించి సొరంగం తవ్వాల లేక లిఫ్ట్ ఏర్పాటు చేయాలనేదానిపై అప్పటి సీఏం చంద్రబాబు ఆరుగురితో కమిటీ వేశారని, ఆ కమిటీ లిఫ్ట్ ఏర్పాటు చేయాలని సూచించిందని, పనులు కూడా ప్రారంబించారని ఆయన గుర్తు చేశారు. కానీ వైయస్ హాయాం లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ చేపట్టి నప్పుడు తెలంగాణ వారు గొడవ చేస్తారని, శ్రీశైలం సొరంగం పనులు కూడా ప్రారంబించారని, తెలంగాణ ప్రభుత్వం వాచ్చాక ..మొదటి సంవత్సరం లోనే శ్రీశైలం సొరంగం పనుల మీద అసెంబ్లీ కమిటీ హాల్ లో అన్ని పక్షాలతో సీఎం సమీక్ష చేసారని ఆయన అన్నారు. 

2005లో జయప్రకాష్ కంపెనీ కి పనులు అప్పిగించారని, 943కోట్ల రూపాయలు ఈ సొరంగం పనుల కోసం ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, ఇంకా పది కిలోమీటర్ల పనిమిగిలిందని ఆయన అన్నారు. 2009 లో శ్రీశైలం ప్రాజెక్ట్ కు  వాటర్ ఫ్లో ఎక్కువ కావడం తో గేట్లు ఎత్తివేశారని, దీంతో వరద అంతా సొరంగం వైపు రావడం తో సొరంగం మునిగి పోయి ..మిషనరీ అంతా పాడైపోయిందని ఆయన అన్నారు. ఇది పకృతి వైపరీత్యం కాదు... మానవ తప్పిదమని తాను అప్పుడే చెప్పానని ఆయన చెప్పారు. 

ఈ సమయంలో పనులు చేయలేమని జయప్రకాష్ కంపెనీ చెప్తే...మిషనరీ రిపేరు ఖర్చులకు 200కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ కంపెనీ కి ఇచ్చిందని, జేపిఎమ్ కంపెనీ దివాళా తీసింది ..16కోట్ల కరెంటు బిల్లు బకాయి ఉన్నా...కరెంటు ఆపొద్దు అని మెల్లగా పనులు చేయిస్తున్నామని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు ను అప్పుడు జానారెడ్డి కానీ మిగతా కాంగ్రెస్ నేతలు ఎవరు వ్యతిరేకించలేదని ఆయన గుర్తు చేశారు. డిండి రిజర్వాయర్ 93శాతం పూర్తయిందని చెప్పారు. 

కాంగ్రెస్ పేరు కోసమే తెలంగాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిందని, తెలంగాణ వచ్చాక తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రాంతియతత్వాన్ని రెచ్చ గొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పుడు విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు... కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏంధుకు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించలేదని ఆయన అడిగారు. అధికారం ఉన్నప్పుడు  నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు మాట్లాడితే ఏం లాభమని ఆయన అన్నారు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడితే  తలాతోక ఉండదు....అసత్యాలు ,అబద్ధాలు తప్ప ఆయన నోట మరో మాట రాదని ఆయన అన్నారు. ఏపీ ఇచ్చిన 203 జీవో సరైంది కాదని, నాగార్జున సాగర్ ను నిర్వీర్యం చేయడమే ఈజోవో ఉద్దేశ్యమని ఆయన అన్నారు.

click me!