ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం: తేల్చేసిన తెలంగాణ హైకోర్టు

Published : Oct 22, 2021, 03:15 PM ISTUpdated : Oct 22, 2021, 03:25 PM IST
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం: తేల్చేసిన తెలంగాణ హైకోర్టు

సారాంశం

తెలంగాణలో ఇంటర్ పరీక్షలను ఆపేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పేరేంట్స్ సంఘం ఆధ్వర్యంలో  దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని హైకోర్టు పిటిషనర్ ను కోరింది. దీంతో ఈ పిటిషన్ ను పేరేంట్స్ ఉపసంహరించుకొంది.

హైదరాబాద్:ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 25వ తేదీ నుండి Inter First Yearపరీక్షలు యధావిధిగా జరగనున్నాయి.Telanganaలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.అయితే ఈ తరుణంలో పేరేంట్స్ సంఘం ఆధ్వర్యంలో దాఖలు చేసిన Lunch motion petiton  పై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. పేరేంట్స్ సంఘం తరపున  హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.

also read:తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుకై హైకోర్టులో పిటిషన్

ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ సమయంలో పరీక్షలను నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పిటిషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని  హైకోర్టు పిటిషనర్ ను కోరింది. దీంతో పిటిఝనర్ పిటిషన్ ను ఉపసంహరించుకొన్నారు.ఇంటర్ ఫస్టియర్ ప్రమోటైన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించవద్దని ఆ పిటిషన్ లో కోరారు.విద్యార్ధులన పాస్ చేయాలని ఆ పిటిషనర్ కోరారు.ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్ధులకు ఈ నెల 25వ తేదీ నుండి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

గత ఏడాది కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ఈ మాసంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాలని  నిర్ణయం తీసుకొన్నారు.ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు. నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచారు.. 25 వేల మంది ఇన్విజిలేటర్‌లకు విధులు కేటాయించారు. పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్