Huzurabad Bypoll: ఈటల రాజేందర్ కు అన్యాయం జరిగింది.. కానీ..: కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 22, 2021, 3:07 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హన్మంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈటలకు మంచి పేరుందని... ఆయనకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనన్నారు. 

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మంచి పేరుందని... కానీ ఆయన బిజెపిలో చేరి తప్పు చేసాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హన్మంతరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంకోసం సాగిన ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఈటల... అలాంటిది ఆయనకు అన్యాయం జరిగింది. ఈటల బిజెపి తరపున కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉండాల్సిందని హన్మంతరావు అన్నారు. 

Huzurabad bypoll నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు v hanmathrao. ఈ సందర్భంగా హుజురాబాద్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మట్లాడారు. కేవలం సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల లొల్లి ఈ ఉపఎన్నిక అన్నారు. 

''BJP లోకి ఎందుకు పోయావు ఈటల? నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది బీజేపీ. ఓట్ల కోసం బిజెపి వాళ్లు వస్తే నిత్యావసర ధరలు ఎందుకు పెంచారంటూ నీలదీయండి. నువ్వు గెలిస్తే నిత్యావసర ధరలు తగ్గిస్తావా ఈటల'' అంటూ వీహెచ్ సవాల్ విసిరారు. 

వీడియో

''కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని సంస్థలకు బిజెపి అమ్ముకుంటోంది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం వైన్స్ లకు సాయిబాబా, వెంకటేశ్వర అంటూ దేవుళ్ల పేర్లు పెట్ట అమ్ముకుంటోంది. ఇలాంటి పార్టీలను ఓడించి హుజురాబాద్ ఎన్నికలు ఒక దిక్సూచి కావాలి'' అన్నారు వీహెచ్.

PHOTOS  Huzurabad Bypoll: జోరందుకున్న కాంగ్రెస్... బల్మూరి వెంకట్ ఇంటింటి ప్రచారం (ఫోటోలు)

''దళిత బంధు కేవలం హుజురాబాద్ కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా వున్న పదిహేను లక్షల కుటంబాలకు ఇవ్వాలి. బిసీ మైనారిటీలకు కూడా లబ్ది చేకూర్చాలి. ఇదే congress party ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్'' అని తెలిపారు. 

''ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే sonia gandhi కాళ్ళుకడిగి నెత్తిమీద చల్లుకుంటాను అన్నాడు KCR. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని ఇచ్చిన అదే కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు'' అని వీహెచ్ పేర్కొన్నారు.

ఇదిలావుంటే హుజురాబాద్ ఎన్నిక చివరిదశకు చేరుకుంది. అక్టోబర్ 1న హుజురాబాద్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 8వ తేదీ వరకు కొనసాగింది. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యింది. ఇక అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు మిగిలివుంది. 

ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విద్యార్థి సంఘం నాయకులను బరిలోకి దింపాయి. టీఆర్ఎస్వీ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్,  ఎన్ఎస్ యూఐ నాయకుడు బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది. బిజెపి తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగారు. 
 

click me!