హైద్రాబాద్‌లో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతి

Published : Jan 25, 2021, 09:04 PM IST
హైద్రాబాద్‌లో రైతుల ర్యాలీకి  హైకోర్టు అనుమతి

సారాంశం

ఈ నెల 26న హైద్రాబాద్ లో రైతుల ర్యాలీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు  సోమవారం నాడు అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్:ఈ నెల 26న హైద్రాబాద్ లో రైతుల ర్యాలీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు  సోమవారం నాడు అనుమతి ఇచ్చింది. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో  రైతు సంఘాల ఆధ్వర్యంలో  ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి మద్దతుగా  హైద్రాబాద్ లో  రైతులు ర్యాలీ నిర్వహించనున్నారు.

ఈ మేరకు తెలంగాణ హైకోర్టు  ఈ ర్యాలీకి అనుమతి ఇచ్చింది. సరూర్‌నగర్ స్టేడియం నుండి ఉప్పల్ స్టేఢియం వరకు ర్యాలీ నిర్వహణకు కోర్టు అనుమతి ఇచ్చింది.కరోనా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహించాలని హైకోర్టు సూచించింది.  ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ర్యాలీని నిర్వహించాలని హైకోర్టు సూచించింది. 

ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాచకొండ కమిషనర్ కు ఆదేశించింది.నూతన వ్వవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో  నెలన్నర రోజులుగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలకు మద్దతుగా  ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్