బోయిన్‌పల్లి కిడ్నాప్: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు

Published : Jan 25, 2021, 06:22 PM IST
బోయిన్‌పల్లి కిడ్నాప్: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు

సారాంశం

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై పోలీసులు సోమవారం నాడు సికింద్రాబాద్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.


హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై పోలీసులు సోమవారం నాడు సికింద్రాబాద్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

పరారీలో ఉన్న విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని  కౌంటర్ లో పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులను కిడ్నాప్ చేశారు.

also read:బోయిన్‌పల్లి కేసు: జగద్విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్

ఈ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టై ఇటీవలనే విడుదలయ్యారు. ఇదే కేసులో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, జగత్  విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను, చంద్రహాస్ ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ పై  విచారణ సందర్భంగా  ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని జగత్ విఖ్యాత్ రెడ్డి తరపు న్యాయవాది ప్రకటించారు.ఈ పిటిషన్ పై విచారణను సికింద్రాబాద్ కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ