
తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాల విడుదలపై ప్రతిష్టంభన తొలగింది. ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర హైకోర్టు అనుమతించింది. స్థానికత వివాదంపై టీఎస్‌పీఎస్సీ కౌంటర్‌పై జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఓ అభ్యర్ధి స్థానికత వివాదంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు చేయగా దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. అలాగే స్థానిక వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఫలితాలు వెల్లడించవచ్చని టీఎస్‌పీఎస్సీకి హైకోర్ట్ సూచించింది. అభ్యర్ధి స్థానికత వివాదాన్ని తర్వాత తేలుస్తామని న్యాయస్థానం పేర్కొంది.