రాహుల్ ఓయూకి రావొద్దని తొడలు కొట్టారు.. మేం తలచుకుంటే : టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 04, 2022, 07:14 PM ISTUpdated : May 04, 2022, 07:15 PM IST
రాహుల్ ఓయూకి రావొద్దని తొడలు కొట్టారు.. మేం తలచుకుంటే :  టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు తెలంగాణ హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జగ్గారెడ్డి ఫైరయ్యారు. తాము తలచుకుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తొడలు తీయడం పెద్ద విషయం కాదన్నారు.   

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబం పట్ల చూపించాల్సిన కనీస కృతజ్ఞత ఇదేనా అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రావొద్దని ఉస్మానియాలో తొడలు కొట్టారని.. తాము తలచుకుంటే ఆ తొడలు తీయడం పెద్ద పనికాదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అయితే తొడలు కొట్టేస్తారా అంటూ ఫైరయ్యారు. ఉద్యమం సమయంలో నిరసనకారులపై రబ్బరు బుల్లెట్ కూడా ప్రయోగించడానికి వీల్లేదని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి (kiran kumar reddy) సోనియా గాంధీ (sonia gandhi) ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని జగ్గారెడ్డి  సూచించారు. విద్యార్ధులు చనిపోకూడదనే ఉద్దేశంతో చిదంబరం చేత 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందనే ప్రకటన ఇప్పించారని ఆయన  గుర్తుచేశారు. 

ఉద్యోగాలు వచ్చి బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్ధులు పాలుపంచుకున్నారని అన్నారు జగ్గారెడ్డి. సోనియా, రాహుల్‌లు తెలంగాణను ఇచ్చారని... దాదాపు ఎనిమిదేళ్లు గడుస్తున్నా , నిన్న మొన్నటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని ఆయన దుయ్యబట్టారు. తమకు అనుమతి వున్నా, లేకపోయినా రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆయన అక్కడికి వెళ్తేనే తెలంగాణలోని విద్యావ్యవస్థలో వున్న సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. 

కాగా.. కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఓయూ పర్యటనకు (osmania university) తెలంగాణ హైకోర్టు (telangana high court) అనుమతి మంజూరు చేసింది. రాహుల్ సభకు అనుమతించాలని ఓయూ వీసీని హైకోర్టు ఆదేశించింది. విద్యార్ధులతో రాహుల్ ముఖాముఖికి న్యాయస్థానం అనుమతించింది. 150 మందితో మాత్రమే అనుమతించాలని వీసీని ఆదేశించింది. 

అంతకుముందు ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది న్యాయస్థానం. విద్యార్ధుల సమస్యలు తెలుసుకునేందుకే.. రాహుల్ వస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. గతంలో వివిధ పార్టీలు చాలా సమావేశాలు పెట్టాయని.. ఇప్పుడు ఎందుకు అనుమతివ్వడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సింగిల్ బెంచ్ ఆదేశాలతో మళ్లీ దరఖాస్తు చేసుకున్నామని.. అయినా అనుమతి నిరాకరించారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?