వామన్‌రావు దంపతుల హత్య: నివేదిక కోరిన తెలంగాణ హైకోర్టు

By narsimha lodeFirst Published Feb 18, 2021, 12:35 PM IST
Highlights

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.పెద్దపల్లిలోని కాల్వచర్లలో ఈ నెల 17న వామన్ రావు దంపతులను దుండగులు దారుణంగా నడిరోడ్డుపై నరికిచంపారు.

also read:వామన్‌రావు దంపతుల హత్య: సుమోటో‌గా తీసుకొన్న తెలంగాణ హైకోర్టు

ఈ హత్యను తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఈ కేసుపై  తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ హత్యలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేయాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. 

ఈ హత్యపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని హైకోర్టు సూచించింది. హత్యకేసులో నిందితులను వెంటనే పట్టుకోవాలని కోరింది.ఈ కేసుపై విచారణను ఈ ఏడాది మార్చి 1వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

వామన్ రావు కు రక్షణ కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయలేదని వామన్ రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 
 

click me!