TS Police Recruitment 2022: ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు ఖరారు.. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ ఎప్పటి నుంచంటే?

Published : Jul 04, 2022, 02:54 PM ISTUpdated : Jul 04, 2022, 03:00 PM IST
TS Police Recruitment 2022: ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు ఖరారు.. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ ఎప్పటి నుంచంటే?

సారాంశం

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి పరీక్ష తేదీలు ఖరారు అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుల్ ప్రలిమినరీ రాత పరీక్షల తేదీలను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం (జూలై 4) రోజున ప్రకటించింది. 

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి పరీక్ష తేదీలు ఖరారు అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుల్ ప్రలిమినరీ రాత పరీక్షల తేదీలను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం (జూలై 4) రోజున ప్రకటించింది. ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్టుగా పేర్కొంది. ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్టుగా పేర్కొంది.

ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు www.tslprb.in ద్వారా పొందవచ్చని తెలిపింది. జూలై 30 నుంచి ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే ఆగస్టు 10 నుంచి కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకన్న అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ చేసుకోవచ్చని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. 

 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు